Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంట్లో ఫ్రిజ్‌ని ఎలా వాడాలి? చిట్కాలు?

కొంతమంది ఇళ్లలో ఫ్రిజ్ ఉందికదా అని తెచ్చిన పండ్లు, కూరగాయలు అన్నీ చేర్చి పట్టకుండా అందులో నింపేస్తుంటారు. అలా చేసినప్పుడు కొద్ది రోజులకే అవి నిల్వ సంగతి ఏమోకానీ త్వరగా పాడవుతుంటాయి. ఇలా ఎందుకు జరిగింద

ఇంట్లో ఫ్రిజ్‌ని ఎలా వాడాలి? చిట్కాలు?
, బుధవారం, 23 మే 2018 (11:00 IST)
కొంతమంది ఇళ్లలో ఫ్రిజ్ ఉందికదా అని తెచ్చిన పండ్లు, కూరగాయలు అన్నీ చేర్చి పట్టకుండా అందులో నింపేస్తుంటారు. అలా చేసినప్పుడు కొద్ది రోజులకే అవి నిల్వ సంగతి ఏమోకానీ త్వరగా పాడవుతుంటాయి. ఇలా ఎందుకు జరిగిందో తెలియక సతమతమవుతుంటారు. అలాంటి వారు చింతించాల్సిన పనిలేదు. ఫ్రిజ్‌లో పళ్ళు, కూరగాయలు నిల్వచేసుకునేటపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం.. 
 
మార్కెట్ నుంచి కూరగాయలు, పళ్ళు తెచ్చిన వెంటనే అన్నీ కలిపి ఫ్రిజ్‌‌లో ఒకే చోట భద్రపరచకూడదు. వేటికవి విడదీసి, విడివిడిగా, రంధ్రాలున్న కవర్లలో పెట్టుకోవాలి. దీనివల్ల గాలి సర్క్యులేట్ అవుతుంది. ఫలితంగా అవి ఎక్కువ సమయం తాజాగా కూడా ఉంటాయి. ఉల్లిపాయలు, టమోటో, వెల్లుల్లి, అరటిపళ్ళు మొదలైనవి ఫ్రిజ్‌లో పెట్టకూడదు. బంగాళదుంపలు, మష్రూమ్స్ మొదలైనటువంటి వాటిని కూరలు చేసేందుకు ఉపయోగించే వరకు కడగకూడదు. అప్పుడే అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
 
ఉల్లి వెల్లుల్లి, మొదలైనవి ఫ్రిజ్‌లో కన్నా బయటే గాలి, వెలుతురు ధారళంగా వచ్చే ప్రాంతంలో ఉంచితేనే ఎక్కువ కాలం తాజగా ఉంటాయి. ఆకు కూరలు తెచ్చిన వెంటనే వాటికున్న బ్యాండ్లు, తాళ్ళు తీసేయాలి. తర్వాత చల్లని నీటితో వాటిని కడిగి పాడైపోయినవి, కుళ్లిన వంటివాటిని తీసేయాలి. వేటికవి విడదీసి విడివిడిగా కవర్లలో పెట్టి భద్రపరచుకోవాలి.
 
ఫ్రిజ్‌లో భద్రపరిచే ఆకుకూరలు కాస్త వాడిపోయినట్లుగా కనిపిస్తాయి. అలా కాకుండా ఉండాలంటే, ఆకుకూరల కాడలను ట్రిమ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసిన చివర్లను ఒక చిన్న పాత్రలో నీటిలో ఉంచుతూ పైభాగాన్ని కవర్‌తో కప్పి ఉంచాలి. ఇలా చేయడం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. టమోటోల విషయానికొస్తే అవి బటయ ఉన్నా కూడా గది ఉష్ణోగ్రత వద్ద బాగానే నిల్వఉంటాయి. వాసన, రుచి సహజంగా నిలిచి ఉంటాయి. ఫ్రిజ్‌లో ఉన్న టమోటలైతే కాస్త రుచి తగ్గుతాయనే చెప్పవచ్చు.
 
ఫ్రిజ్‌లో మాంసాహారన్ని కూడా భద్రపరచాల్సి వస్తే ముందు రక్తం లేకుండా బాగా శుభ్రంగా చేసుకోవాలి. తర్వాత ఒక కవర్ లేదా మూత ఉన్న పాత్రలో పెట్టుకొని నిల్వ చేసుకోవాలి. లేదంటే ఆ వాసన ఫ్రిజ్ మొత్తం వ్యాప్తించే అవకాశం ఉంటుంది. అలాగే శుభ్రంగా లేని మాంసం ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల మిగిలిన ఆహార పదార్థాలు కూడా తొందరగా చెడిపోయే ప్రమాదం ఉంటుంది.
 
క్యారెట్లు, బీట్‌రూట్లను వాడే ముందు మాత్రమే తొక్క తీయ్యాలి. అలా అయితేనే వాటిలో తేమ ఎక్కువ కాలం నిలిచి ఉండి తాజాగా ఉంటాయి. అలాగే కూరగాయలు, పండ్లను ఫ్రిజ్‌లో ఒకచోటే ఉంచడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే, బాగా పండిన పళ్ళ నుంచి ఇథిలీన్ అనే గ్యాస్ వెలువడుతుంది. అది కూరగాయల మీద కూడా ప్రభావం చూపించి తొందరగా పాడయ్యేలా చేస్తుంది. అందుకే వేటికవి విడిగా భద్రపరచాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్నింగ్ వాక్... ఎందుకు చేయాలో చూస్తే ఖచ్చితంగా చేస్తారంతే...