Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మచెక్క రసానికి ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి...

సాధారణంగా మహిళలలో ముఫ్పై ఏళ్ల తరువాత ఎముకలలో సాంద్రత తగ్గుతుంది. ఎముకలు పెళుసుబారి పోవడం, కీళ్లనొఫ్పులు రావడం లాంటి సమస్యలు వస్తుంటాయి. సమతులాహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యను దాదాపు రాకుండా చేయవచ్చు. ఎముకలు ధృడంగా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో

Advertiesment
Joint pains
, సోమవారం, 17 సెప్టెంబరు 2018 (21:02 IST)
సాధారణంగా మహిళలలో  ముఫ్పై ఏళ్ల తరువాత ఎముకలలో సాంద్రత తగ్గుతుంది. ఎముకలు పెళుసుబారి పోవడం, కీళ్లనొఫ్పులు రావడం లాంటి సమస్యలు వస్తుంటాయి. సమతులాహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యను దాదాపు రాకుండా చేయవచ్చు. ఎముకలు ధృడంగా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం.
 
1. ప్రతిరోజు తీసుకునే ఆహారంలో క్యాల్షియం, విటమిన్ -డి ఉండేలా చూసుకోవాలి. పాలు, పెరుగు, తాజాపండ్లు, కాయగూరలు, గుడ్లు తీసుకోవడం వల్ల ఎముకలకు కావలసిన బలం చేకూరుతుంది. వీటికి అదనంగా చిరుధాన్యాలు, పండ్లరసాలు తీసుకుంటే మంచిది.
 
2. రోజు ఉదయం ఎండలో కాసేపు కూర్చోవటం వలన విటమిన్-డి పుష్కలంగా అందుతుంది. విటమిన్-డి మాత్రల్ని వాడినా సరిపోతుంది.
 
3. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆరుబయట వ్యాయామం, పరుగు, నడక వంటివి చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారడంతో పాటు ఆరోగ్యంగాను ఉంటారు.
 
4. రాగి పిండిలో క్యాల్షియం శాతం ఎక్కువుగా ఉంటుంది. కనుక ప్రతిరోజు రాగిజావ కాచుకొని త్రాగడం వలన కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది.
 
5. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మచెక్క, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ప్రతిరోజు తీసుకోవడం వలన కీళ్లనొప్పుల సమస్య తగ్గుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పులుపు ఎక్కువ తింటే ఏమిటి? తక్కువ తింటే ఏమిటి?