మూత్రకోశంలో రాళ్ళను కరిగించే ఉలవలు
ఒకప్పుడు ఎడ్లకు, గుర్రాలకు దాణాగా వాడే ఉలవలు ఇళ్ళలో తినడానికి అంతగా ఇష్టపడేవారు కాదు. ఒకవేళ ఎవరైనా ఉలవలు గుగ్గిళ్ళుగా చేసుకొని తినడమో లేక చారు తయారుచేసుకుని వాడడమో చేస్తే వారు పేదవారై ఉండేవారు . కానీ నేడు ఉలవలు - ఉలవచారు విందు వినోదాలలో వాడడం స్టేటస్
ఒకప్పుడు ఎడ్లకు, గుర్రాలకు దాణాగా వాడే ఉలవలు ఇళ్ళలో తినడానికి అంతగా ఇష్టపడేవారు కాదు. ఒకవేళ ఎవరైనా ఉలవలు గుగ్గిళ్ళుగా చేసుకొని తినడమో లేక చారు తయారుచేసుకుని వాడడమో చేస్తే వారు పేదవారై ఉండేవారు . కానీ నేడు ఉలవలు - ఉలవచారు విందు వినోదాలలో వాడడం స్టేటస్ సింబల్ అనడంలో అతిశయోక్తి లేదు. ఉలవచారు నేడు అత్యంత ఖరీదైన వంటకం.
ఉలవలను ముఖ్యంగా చారు రూపంలో వాడతతారు. ఇవి వేడిచేసే గుణం కలవి. ఉలవచారు చిక్కగా ఎర్రని లేక ఇటుకరాయి రంగులో ఉంటుంది. తినడానికి ఉలవచారు కమ్మగా ఉన్నప్పటికీ వాతము చేసే గుణము ఉన్న వారు దీనిని ప్రత్యేకించి వాడవచ్చు. ఉలవలు మూత్రకోశంలోని రాళ్ళను కరిగించే గుణం ఉంటుంది. కాబట్టి మూత్రాశయ వ్యాధులలో దీనిని ఇతర మందులతో పాటుగా ఆహారంలో వాడవచ్చు.
ఉలవలు స్త్రీలలో ఋతు స్రావమును జారీ చేసే గుణం కలిగి ఉంది. ఋతువు సరిగా రాని వారు ఉలవలు వాడటం వల్ల ఉపయోగంగా ఉంటుంది. అధికంగా చెమటలు పడుతున్న వారు ఆహారంలో ఉలవలు వాడటం వల్ల చెమటలు హరించిపోతాయి.
ఉలవలు మంచి ప్రొటీన్లను కలిగి ఉన్నాయి. నీరసమును పోగొడుతాయి. నిస్సత్తుతోను, రక్తహీనతతోనూ బాధపడేవారు ఉలవలు తరచూ ఆహారంలో తీసుకుంటే మంచిది. ఉలవలు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. అజీర్తిని పోగొడుతుంది. కడుపులో వాతమును త్వరగా తగ్గిస్తుంది. అజీర్తి విరేచనాలు అయ్యేవారు ఉలవచారు వాడటం వల్ల మేలు జరుగుతుంది.
ఉలవచారు కుక్క కరిచిన వారు అసలు తీసుకోకూడదు. కుక్క కరిచి చాలా రోజులయినప్పటికీ ఉలవచారు వాడారంటే వారి పరిస్థితి ప్రమాదంలో పడుతుంది. రేబిస్ వైరస్ విజృంభించి ప్రాణాపాయం కలిగించవచ్చు.