శృతిమించిన శృంగారమా? అయితే ప్రోస్టేట్ కేన్సర్ ముప్పు ఎక్కువే : పరిశోధన
పలువురు పురుషులు పలువురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు. మరికొందరు బహు భార్యత్వాన్ని కలిగివుంటారు. ఇలాంటి పురుషులకు ప్రోస్టేట్ కేన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది.
పలువురు పురుషులు పలువురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు. మరికొందరు బహు భార్యత్వాన్ని కలిగివుంటారు. ఇలాంటి పురుషులకు ప్రోస్టేట్ కేన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది.
ఒక పురుషుడు... తన జీవిత కాలంలో ఏడుగురికంటే ఎక్కువ మందితో లైంగిక అనుబంధం ఉన్నా.. 17 ఏళ్ల కంటే ముందే లైంగిక చర్యలో పాల్గొన్నా మిగతా వారితో పోలిస్తే ప్రోస్టేట్ కేన్సర్ ముప్పు పెరుగుతుందని న్యూసౌత్ వేల్స్ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది.
ఈ బృందంలో భారత సంతతి పరిశోధకుడు కూడా ఉన్నారు. ఈ పరిశోధన పది వేల మందిపై జరిగింది. లైంగిక చర్యకు ప్రోస్టేట్ కేన్సర్‌కు మధ్య సంబంధం ఉన్నట్టు తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన నాయర్ షాలికర్ చెప్పారు.