Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అధిక రక్తపోటు వున్నవారు గోధుమ జావ తాగితే?

Advertiesment
Home remedies to high blood pressure
, బుధవారం, 29 జనవరి 2020 (22:00 IST)
1. ప్రతిరోజు గోధుమ జావ తాగితే బీపీ ఉన్నవారికి మంచిది. 

2. ఫేషియల్‌ ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల ముడతలను సమర్ధంగా నివారించవచ్చు. హాయిగా నవ్వేవాళ్లు ఎప్పుడూ ఆరోగ్యంగానే కాక అందంగా కూడా కనిపిస్తారు. వార్ధక్యం వీరి దరిచేరదనిపించేలా ఉంటారు. నవ్వడం వల్ల ముఖములోని కండరాలకు ఎక్సర్‌సైజ్‌ కలిగి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. చర్మం పటుత్వంతో ఉంటుంది. కాబట్టి ముడతలు పడవు.
 
3. బరువు తగ్గాలనుకునేవారు రోజువారీ ఆహారంలో కనీసం ఐదుసార్లు పచ్చికూరగాయలు, పండ్లు తీసుకోవాలి. వాటిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌ సమృద్ధిగానూ కేలరీలు తక్కువుగా వుంటాయి.
 
4. భరించరానంత తలనొప్పి తగ్గాలంటే పది తులసి ఆకులు, పది నల్ల మిరియాలను నూరి అందులో టీ స్పూను తేనె కలిపి రోజుకు మూడు సార్లు తినాలి.
 
5. బాదం పప్పు, గసగసాలు కలిపి తింటే రక్తం శుద్దియగును. 
 
6. బెల్లంలో మిరియాల పొడి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని నిద్రించే ముందు తీసుకుంటే జలుబు తగ్గుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గులాబిచెట్టు, జామచెట్టు కలిపి నాటితే..?