Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెల్లుల్లి గుజ్జును అక్కడ అప్లై చేస్తే...?

వెల్లుల్లి గుజ్జును అక్కడ అప్లై చేస్తే...?
, బుధవారం, 22 జనవరి 2020 (20:37 IST)
1. వెల్లుల్లిని ప్రతిరోజు ఉపయోగించడం వలన తరచూ వచ్చే జలుబుకు ఉపశమనం కలుగుతుంది. ఆస్త్మా, శ్వాస తీసుకోవడం వల్ల ఇబ్బంది వంటి ఊపిరితిత్తుల రుగ్మతలు తగ్గించడానికి వెల్లుల్లి ఎంతో ఉపయోగపడుతుంది.
 
2. వెల్లుల్లి ఇన్సులిన్‌ను పెంచుతుంది. మధుమేహగ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
 
3. వెల్లుల్లి గుజ్జును లేదా వెల్లుల్లిని ఉడికించిన నీటిని మెుటిమలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల మెుటిమలు మరియు మచ్చలను సమర్ధవంతంగా నివారిస్తుంది.
 
4. వారానికి 5 వెల్లుల్లిపాయలను పచ్చివి తినటం వలన కేన్సర్ వ్యాధిని 40 నుంచి 50 శాతం వరకు నిర్మూలించవచ్చట. కనుక దీనిని సర్వరోగ నివారిణి అనవచ్చు.
 
5. వెల్లుల్లిలో ధయమిన్ లోపాన్ని తగ్గించి అభివృద్ది చేసే గుణం కూడా పుష్కలంగా ఉంది. వెల్లుల్లిలో విటమిన్ సి అధికంగా ఉండటం వలన నోటి వ్యాధులకు దివ్యఔషధంగా పనిచేస్తుంది.
 
6. వెల్లుల్లి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లిలోని యాంటీబయాటిక్ గుణాలు అజీర్ణం. హైబీపీలను తక్షణం నివారిస్తుంది. శరీరంలోని ఇమ్యునిటీ లెవల్స్‌ని వెంటనే పెంచుతుంది.    
 
7. అధిక బరువుతో బాధపడేవారు రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని ముక్కలుగా చేసి మెత్తగా పేస్ట్ చేసి దానిలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా నెల రోజుల పాటు తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు.
 
8. పచ్చి వెల్లుల్లిలో ఉండే అల్లెసిన్ అనే కంటెంట్ మెటబాలిజం రేటును పెంచుతుంది. ఇది కొవ్వు త్వరగా కరగడానికి సహాయపడుతుంది.
 
9. వెల్లుల్లి పేస్టుని చర్మంపై మొటిమలు, అలర్జీ వంటి వాటిపై రాస్తే ఉపశమనం కలుగుతుంది. రక్త నాళాల్లోని మలినాలు తొలగిపోతాయి. మోకాలి నొప్పులతో బాధపడేవారు వెల్లుల్లి రసాన్ని మోకాలిపై నొప్పి ఉన్న చోట రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 
10. వెల్లుల్లి మన శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేడినీటికి అలవాటు పడిపోతే.. ఆరోగ్యంగా వుంటారట!