Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెల్ల జుట్టును నల్లగా మార్చుకోండిలా...!

తెల్లవెంట్రుకలు… ఈ మాట వింటే చాలు చాల మంది గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కొన్ని వేల వెంట్రుకల్లో ఒక్క తెల్ల వెంట్రుక వచ్చినా తల పట్టుకుని కూర్చుంటాం... ఆ వెంట్రుకని పీకే దాకా మనశ్శాంతి ఉండదు. నల్లవెంట్

Advertiesment
Home Remedies
, శనివారం, 2 జులై 2016 (08:50 IST)
తెల్లవెంట్రుకలు… ఈ మాట వింటే చాలు చాల మంది గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కొన్ని వేల వెంట్రుకల్లో ఒక్క తెల్ల వెంట్రుక వచ్చినా తల పట్టుకుని కూర్చుంటాం... ఆ వెంట్రుకని పీకే దాకా మనశ్శాంతి ఉండదు. నల్లవెంట్రుకలు తెల్లబడితే అందం తగ్గిపోతుందని నలుగురు మనల్ని పెద్దవాళ్లుగా పరిగణిస్తారని భయం. ప్రస్తుత సమాజంలో ఈ సమస్య చాలా మందిలోనూ ఉంది. తల్లో ఉన్న ఒక్క వెంట్రుక దానిని బలవంతంగా తీసేస్తే  అక్కడి నుంచి మరిన్ని తెల్ల వెంట్రుకలు మొలుస్తాయని చాలా మంది అపోహ పడుతుంటారు.
 
నిజానికి తెల్ల వెంట్రుకలకు, నల్ల వెంట్రుకలకు ఉన్న తేడా కేవలం వాటిలో ఉన్న మెలనిన్ మాత్రమే.. తెల్ల వెంట్రుకలలో మెలనిన్‌ రేణువులు ఉండక పోవటం వల్లనే మనకి అవి తెల్లగా కనిపిస్తాయి. వెంట్రుకలు మన చర్మం కింద ఉండే రోమ కుదుళ్ల నుంచి మొలుస్తాయి. ఈ కుదుళ్లు పై చర్మం (ఎపిడెర్మిస్) కింద ఉన్న అంతశ్చర్మం (డర్మిస్)లో ఉంటాయి. అక్కడే మెలనిన్‌ రేణువులు ఉత్పత్తి అవుతూ వెంట్రుక అనే ప్రొటీన్‌ గొట్టంలో దట్టంగా పేరుకుంటూ వస్తాయి. తెల్లని వెంట్రుకలు వచ్చే కుదుళ్ల దగ్గర మెలనిన్‌ రేణువుల ఉత్పత్తి లేకపోవడం కానీ లేదా వృద్ధాప్యం వల్ల మందగించడం కానీ జరుగుతుంది. 
 
ఒక్క వెంట్రుక తీసివేస్తే మరిన్ని వస్తాయన్న భయం. తీయకపోతే వయస్సు మళ్లిన వాళ్లలా కనబడుతామని భయం చాలా మందిని వేధిస్తుంది. వీటిని అరికట్టడానికి మార్కెట్‌లోకి ఎన్నో ప్రొడక్ట్స్ వచ్చినా..వాటిని వాడితే ఏమవుతుందోనన్న భయం కూడా కలుగుతుంది. దీంతో యువతీయువకులు సమాజంలో గౌరవంగా తిరగలేక పోతుంటారు. కాబట్టి దీనిని ఇంటి వైద్యం తోనే నివారించవచ్చు.
రాత్రిపూట ఉసిరికాయ, కుంకుడుకాయ, శీకాకాయల మిశ్రమాన్ని తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే గోరింటాకు కలిపి మరల రెండు-మూడు గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పేస్ట్‌లా చేసి వెంట్రుకలపై ప్యాక్‌లా వేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే వెంట్రుకలు నల్లగా మారి, ఒత్తుగానూ పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు ఆహారంలో కరివేపాకును ఎక్కువగా తీసుకుంటే నల్లని నిగనిగలాడే కురులు మీ సొంతమవుతుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాలతో ఉప్పు... పాలు తాగి పనసపండు తింటే ఏమవుతుంది...?