Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిమ్మనీటిలో ఉప్పు కలిపి సేవిస్తే..?

Advertiesment
నిమ్మనీటిలో ఉప్పు కలిపి సేవిస్తే..?
, శుక్రవారం, 9 నవంబరు 2018 (14:41 IST)
నిమ్మకాయ లేని ప్రాంతం అంటూ ఏది ఉండదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ నిమ్మకాయలే ఎక్కువగా అమ్ముతున్నారు. మరి నిమ్మలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.. ఊబకాయం సమస్య వయసు తేడా లేకుండా వస్తుంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే.. గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఓ నిమ్మకాయ రసం కలిపి కొద్దిగా ఉప్పు వేసి తీసుకుంటే ఊబకాయం తగ్గుతుంది.
 
జీర్ణాశయ వ్యాధితో బాధపడేవారు నిమ్మరసంలో తేనె కలిపి సేవిస్తే సమస్య తగ్గుతుంది. దాంతో శరీరంలోని వ్యర్థ పదార్థాలు కూడా తొలగిపోతాయి. అలానే నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి పళ్ళు తోముకుంటే చిగుళ్ళ వ్యాధులు రావు. చాలామందికి ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి వారి నిమ్మకాయ వాసన పీల్చుకుంటే లేదా నిమ్మ చెక్కను చప్పరించినా వాంతులు తగ్గుతాయి. 
 
రోజంతా పనిచేసిన వారికి కాస్త నీరసంగా ఉంటుంది. వారు కొబ్బరినీటిలో నిమ్మరసం పిండుకుని తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అందుకని అదే పనిగా నిమ్మరసం సేవిస్తే స్త్రీలకు గర్భస్రావాలు జరగవు. శరీరంలో వేడి గలవారికి నిమ్మషర్బత్ బాగా పనిచేస్తుంది. వడదెబ్బతో బాధపడేవారు నిమ్మనీళ్ళలో ఉప్పు కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యరీత్యా లెమన్ టీ ఎంతో మంచిది. భోజనానికి ముందు, తరువాత నిమ్మచక్కతో చేతులు శుభ్రం చేసుకుని ఆహారాన్ని భుజించాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రసవం తర్వాత నాలో కోరికలు అడుగంటి పోయాయి.. ఎందుకని?