సాయంత్రం పూట అల్పాహారంలో పాప్ కార్న్ తీసుకుంటే.. బరువు పెరగరని న్యూట్రీషియన్లు చెప్తున్నారు. స్నాక్స్ టైమ్‌లో ఉడికించిన శెనగలు, పెసలు, పాప్‌కార్న్ వంటివి చేర్చుకుంటే పొట్ట నిండినట్లువుంటుంది. తద్వారా ఆహారాన్ని అధికంగా తీసుకోలేరు. తద్వారా ఒబిసిటీ సమస్య వేధించదు. ముఖ్యంగా ఉద్యోగినులు ఉదయంపూట అల్పాహారంతోపాటు ఓ గ్లాసు రాగి జావ తాగితే రోజంతా చురుగ్గా ఉంటారు.
మధ్యాహ్నం అన్నంలో కూరగాయలతో చేసిన కూరలు, ఉడికించిన గుడ్డు లేదా కొంత మొత్తంలో సోయా తీసుకుంటే శరీరానికి కావల్సిన మాంసకృత్తులు అందుతాయి. పాప్ కార్న్ ఫైబర్‌ను కలిగివుంటుంది. ఇది రక్త నాళాలు, ధమనుల గోడల మీద పేరుకుపోయిన అదనపు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. అలాగే శరీరం మొత్తంలో కొలెస్ట్రాల్ స్థాయులను బాగా తగ్గిస్తుంది. హృద్రోగాలను దూరం చేస్తుంది.
పాప్‌కార్న్‌లో అధిక మోతాదులో మాంగనీస్ ఉంది. ఇది ఎముకలకు బలాన్నిస్తుంది. మాంగనీస్ అనేది ఎముకల నిర్మాణానికి తోడ్పడుతుంది. ఎముకలకు సంబంధించిన వ్యాధులను దూరం చేస్తుందని వైద్యులు చెప్తున్నారు.