Publish Date: Sat, 21 Jan 2023 (18:56 IST)
Updated Date: Sat, 21 Jan 2023 (18:58 IST)
పుచ్చకాయలో 90 శాతం నీరు వుంటుంది. పుచ్చకాయ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆరగించే పండు. ఇది రుచిని మాత్రమే కాకుండా, చాలా పోషక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము.
శరీరానికి అవసరమైన ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది.
పుచ్చకాయ రసంలో కాస్తంత తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది.
మలబద్ధకం ఉన్నవారు పుచ్చకాయ తింటుంటే సమస్య తగ్గుతుంది.
మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి పుచ్చకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
పుచ్చపండు గింజలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి యవ్వనంగా కనపడేలా చేస్తాయి.
పుచ్చకాయ విత్తనాలను తీసుకోవటం వలన చర్మ క్యాన్సర్, ఇన్ఫెక్షన్ వంటి చర్మ రుగ్మతలకు దూరంగా ఉంచుతుంది.
పుచ్చపండు గింజల్లో మెగ్నీషియం ఉంటుంది, ఈ మూలకం గుండె సంబంధిత వ్యాధులు, హైపర్ టెన్షన్‌లను తగ్గిస్తుంది.