సాధారణంగా మన ఇంటిలో అన్నం వండేటప్పుడు వచ్చే గంజి నీటిని పారబోస్తుంటారు. వాస్తవానికి అలా చేయకూడదు. మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు గంజి నీటిలో ఉంటాయి. అందుకే గంజి నీటిని పారబోయకుండా వాటిని గోరు వెచ్చని ఉండగానే అందులో కాస్తంత ఉప్పు వేసి తాగడం వలన మనకు అనేక లాభాలు కలుగుతాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.
* వేసవిలో శక్తి త్వరగా ఆవిరైపోతుంటుంది. అలాంటి వారు గంజి నీటిని తాగితే మంచిది. త్వరగా శక్తిని మళ్లీ పుంజుకుంటారు.
* గంజి నీటిలో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి అవసరమయ్యే పోషణ లభిస్తుంది. విటమిన్లలోపం రాకుండా జాగ్రత్తపడవచ్చు. పిల్లలకు గంజిని తాగిస్తే చాలా మంచిది. వారి శారీరక ఎదుగుదల సరిగ్గా ఉంటుంది.
* పసిపిల్లలు పాలు సరిగ్గా తాగకపోతే వారికి కనీసం గంజి నీటినైనా తాగించాలి. దాంతో వారికి కావాల్సిన ఆహారం సరిగ్గా అంది శక్తి లభిస్తుంది. పోషణ సరిగ్గా ఉంటుంది.
* విరేచనాలు అయిన వారు గంజి నీటిని తాగితే వెంటనే విరేచనాలు తగ్గుతాయి.
* చర్మంపై దురద వస్తుంటే ఆ ప్రదేశంలో కొద్దిగా గంజి నీటిని పోసి సున్నితంగా మర్దనా చేయాలి. ఫలితంగా దురదలు తగ్గిపోతాయి.