Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుమ్మడి గింజలు సేవిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే?

గుమ్మడి గింజలు సేవిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే?
, శనివారం, 13 అక్టోబరు 2018 (11:03 IST)
గుమ్మడి గింజలు తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఈ గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు ఉపయోగపడుతాయి. మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుటకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. పురుషులకు శృంగార సామర్థ్యన్ని పెంచుతుంది.
 
గుమ్మడి గింజల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ అల్సర్ వంటి సమస్యల నుండి కాపాడుతుంది. శరీరంలోని వేడిని తగ్గించేందుకు ఇలా చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చును. గుమ్మడి గింజలను ఎండబెట్టి పొడిచేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా వేడినీళ్లల్లో కలిపి కొద్దిగా ఉప్పు వేసుకుని తీసుకుంటే శరీర వేడి తగ్గుముఖం పడుతుంది. 
 
తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు ఈ గింజలతో తయారుచేసిన నూనె వాడితే మంచి ఉపశమనం లభిస్తుంది. నిద్రలేమి వంటి సమస్యలు తొలగిపోతాయి. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. శరీరానికి కావలసిన మెగ్నిషియం గుమ్మడి గింజల్లో పుష్కలంగా లభిస్తుంది. అందువలన ప్రతిరోజూ ఈ గింజలను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే మంచిది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తలనొప్పి వేధిస్తుంటే... మటన్ తీసుకోవడం మానేయాలా?