Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తొక్కే కదా అని పారేయకండి.. ఆరెంజ్ తొక్కతో ఎన్ని ఉపయోగాలో... !!!

orange peel
, శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (07:57 IST)
చాలా మంది ఆరెంజ్ పండు తొక్కను పారేస్తుంటారు. తొక్క కదా.. అందులో ఏముందిలో అని పడేస్తుంటారు. నిజం చెప్పాలంటే తొక్కతో ఎన్నో రకాలైన ప్రయోజనాలు ఉన్నాయని పౌషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరెంజ్ తొక్క వల్ల కలిగే ఉపయోగాలు, ప్రయోజనాలను పరిశీలిస్తే,
 
నారింజ తొక్క చర్మం నుండి అదనపు నూనెను తొలగించడానికి దోహదపడుతుంది. ఈ తొక్కలను చర్మంపై  రాస్తే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ఇంకా చర్మాన్ని మృదువుగా చేసేందుకు నారింజ తొక్క అద్భుతంగా పని చేస్తుంది.
 
కొవ్వొత్తులను నారింజ తొక్క నుంచి కూడా తయారు చేయొచ్చు. ఇది నారింజ సువాననతో ఉంటుంది. నారింజపై ఉండే తొక్కను మైనంతో కలిసి కొవ్వుత్తులను తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
 
దంతాలను తెల్లగా మార్చడంలో ఆరెంజ్ తొక్క చాలా ప్రభావవంతంగా ఉంటుంది. నారింజ తొక్కను మీ దంతాలపై రోజుకు రెండుసార్లు రుద్దితే మీ దంతాలు సహజంగా తెల్లబడతాయి.
 
ఇంట్లో చెక్క ఫర్నీచర్‌ను మళ్లీ పాలిష్ చేయాలని భావిస్తే, పాలిష్ అవసరం లేకుండానే ఫర్నీచర్‌ను నారింజ తొక్కతో రుద్ది ఆ తర్వాత పొడి గుడ్డతో తుడవాలి.
 
నారింజ కొత్తగా ఆరెంజా బాత్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. తర్వాత స్నానం చేసే నీటిలో వాడాలి. చర్మం రంగును పునరుద్ధరించడంలో ఎంతగానో దోహదపడుతుంది.
 
నారింజ తొక్కలతో టీ బ్యాగులను కూడా తయారు చేసుకోవచ్చు. వాటితో టీ తయారు చేసుకుని తాగొచ్చు. ఇది నోటికి రుచికరంగా, ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది.
 
నారింజ తొక్కతో ఇంట్లోనే ఎరువు తయారు చేసుకోవచ్చు. ఈ ఎరువు మొక్కలు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది.
 
ఇంట్లో వచ్చె చెడు వాసనను నారింజ తొక్కతో ఎయిర్ ఫ్రెషనర్‌ను తయారు చేసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంచదార అధికంగా తింటే ఏమవుతుంది?