Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లం వాట‌ర్‌తో కొవ్వు క‌రుగుతుంది.... ఎలా?

నడుము, తొడలు, పిరుదుల చుట్టూ కొవ్వు పేరుకున్నప్పుడు చాలా అసహ్యంగా కనిపిస్తుంది. లావుగా మారిన విషయం ఈ భాగాల్లో పేరుకున్న కొవ్వుని చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఇలాంటప్పుడు అల్లం చక్కటి పరిష్కారంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అల్లం మాత్రమే వేగంగా కొవ్వుని కరిగించ

Advertiesment
అల్లం వాట‌ర్‌తో కొవ్వు క‌రుగుతుంది.... ఎలా?
, శుక్రవారం, 22 జులై 2016 (13:18 IST)
నడుము, తొడలు, పిరుదుల చుట్టూ కొవ్వు పేరుకున్నప్పుడు చాలా అసహ్యంగా కనిపిస్తుంది. లావుగా మారిన విషయం ఈ భాగాల్లో పేరుకున్న కొవ్వుని చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఇలాంటప్పుడు అల్లం చక్కటి పరిష్కారంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అల్లం మాత్రమే వేగంగా కొవ్వుని కరిగించగలదు. అల్లంను ప్రతి వంటింట్లో ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఇందులో ఉన్న ఔషధ గుణాలు అనేక అనారోగ్య సమస్యల నుండి మ‌న‌ల్ని కాపాడతాయి. అయితే అధిక కొవ్వుని కరిగించడంలో కూడా అల్లం స‌మ‌ర్థవంతంగా పనిచేస్తుంది.
 
ముఖ్యంగా నడుము, తొడలు, పిరుదుల భాగంలో పేరుకున్న కొవ్వుని తేలికగా కరిగిస్తుంది. అల్లంలో ఉండే జింజరాల్ అనే పదార్థం శరీరంలో ఉన్న అధిక నీటిని బయటకు పంపడానికి సహాయపడుతుంది. దీనివల్ల కొవ్వు కరిగిపోతుంది. అలాగే పొట్టలో పీహెచ్ లెవెల్స్ పెంచడంలోనూ అల్లం సహాయపడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 
 
అలా పొట్టలో బ్లోటింగ్ ప్రాబ్లమ్, కాన్స్టిపేషన్ సమస్యకు దూరంగా ఉండవచ్చు. అలాగే అల్లం మెటబాలిక్ రేట్‌ని శరీరంలో పెంచడానికి సహాయపడుతుంది. మెటబాలిజం పెరిగితే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి జింజర్ వాటర్ ఎలా తయారుచేసుకుని, ఎలా తీసుకోవడం వల్ల ఫ్యాట్ కరిగించడం తేలికవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
 
అల్లం వాటర్ తయారుచేసే విధానం ఒక లీటర్ నీటిని తీసుకుని ఉడికించాలి. ఒక ముక్క అల్లం తీసుకుని శుభ్రం చేసి, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి మరుగుతున్న నీటిలో కలపాలి. మరో 5 నుంచి 10 నిముషాలు ఉడికించాలి. ఆ నీటిని చల్లార్చి, వడకట్టి, తాగాలి. ఈ నీటిని రోజంతా మామూలు నీళ్లు తాగినట్టుగా తాగాలి. మూడు నాలుగు నెలలు క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ శరీరంలో కొవ్వు కరగడాన్ని గమనిస్తారు. తొడలు, పిరుదులు, నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు కరుగుతూ ఉంటుంది. అల్లం వాటర్‌ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. అయితే ఏ రోజుకి ఆ రోజు అల్లం వాటర్ తయారుచేసుకుని తాగడం వల్ల మెరుగైన ఫలితాలు పొందుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో.. 30 ఏళ్లలోనే పలకరిస్తున్న డయాబెటిస్ మహమ్మారి.. మనదేశమే కాపిటల్..!