Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వామ్మో.. 30 ఏళ్లలోనే పలకరిస్తున్న డయాబెటిస్ మహమ్మారి.. మనదేశమే కాపిటల్..!

భారత దేశ ప్రజలకు డయాబెటిస్ మహమ్మారితో బాధలు తప్పట్లేదు. దేశంలో చాలామంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని.. ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతుందని తాజా పరిశోధనలో తేలింది. సాధారణంగా 50

వామ్మో.. 30 ఏళ్లలోనే పలకరిస్తున్న డయాబెటిస్ మహమ్మారి.. మనదేశమే కాపిటల్..!
, శుక్రవారం, 22 జులై 2016 (12:37 IST)
భారత దేశ ప్రజలకు డయాబెటిస్ మహమ్మారితో బాధలు తప్పట్లేదు. దేశంలో చాలామంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని.. ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతుందని తాజా పరిశోధనలో తేలింది. సాధారణంగా 50 ఏళ్లకు పైగా వచ్చే మధుమేహం ప్రస్తుతం 30 వయస్సులోనే పలకరించడంతో.. డయాబెటిస్ మాత్రలు తీసుకునే వారి సంఖ్య దేశంలో అధికమవుతుందని పరిశోధకులు అంటున్నారు. 
 
అంతేగాకుండా డయాబెటిస్ మహమ్మారి భారత జనాభాతో పాటు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. అంతేగాకుండా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఔషధాల్లో మధుమేహానికి సంబంధించిన మందులదే అగ్రపీఠం కావడం ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది జూన్‌ వరకు దేశంలోని టాప్‌-10 ఔషధాల జాబితాలో ఏకంగా ఐదు యాంటీ-డయాబెటీస్‌కు సంబంధించిన మందుల కంపెనీలు ఉన్నాయని ఏఐవోసీడీ తేల్చింది.
 
నవంబర్ 14న ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం రానుండటంతో దేశంలో డయాబెటిస్ మహమ్మారిని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత ఏడాది నిర్వహించిన సర్వేలో ప్రతి నలుగురిలో ఒకరి డయాబెటిస్ ఉందని.. ఇదే అనేక జబ్బులకు దారి తీస్తుందని వైద్యులు చెప్తున్నారు. 
 
ఇక మన దేశంలో ప్రతీ కుటుంబంలో ఒక్కరైనా డయాబెటిస్‌ బారిన పడిపోతున్నారని.. ప్రపంచ వ్యాప్తంగా మనదేశమే డయాబెటిస్‌కి కాపిటల్‌‌గా ఉందని పరిశోధనలో తేలింది. సమయానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్‌గా డాక్టర్‌తో చెకప్‌ చేయిస్తూ, సూచనలు పాటిస్తే డయాబెటిస్‌ పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టివీతో చిన్నారుల్లో స్థూలకాయం...