Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉపవాసంతో మంచి పెరుగుతుంది... చెడు తగ్గుతుంది!

సోమవారం.. గురువారం.. శనివారం.. షష్టి.. ఏకాదశి.. ముక్కోటి.. శివరాత్రి.. ఇలా హిందువులకు ఉపవాసాలకు కొదవ లేదు. ముస్లింలకైతే పవిత్ర రంజాన్‌ మాసం మొత్తం పగటి వేళ ఆహారం ముట్టకుండా రోజా పాటిస్తారు. క్రైస్తవుల

ఉపవాసంతో మంచి పెరుగుతుంది... చెడు తగ్గుతుంది!
, బుధవారం, 13 జులై 2016 (15:10 IST)
సోమవారం.. గురువారం.. శనివారం.. షష్టి.. ఏకాదశి.. ముక్కోటి.. శివరాత్రి.. ఇలా హిందువులకు ఉపవాసాలకు కొదవ లేదు. ముస్లింలకైతే పవిత్ర రంజాన్‌ మాసం మొత్తం పగటి వేళ ఆహారం ముట్టకుండా రోజా పాటిస్తారు. క్రైస్తవులు డేనియల్‌ ఫాస్ట్‌ పేరిట కొత్త సంవత్సరం ఆరంభంలోనే మూడు వారాల పాక్షిక ఉపవాస దీక్ష చెయ్యటం ఆనవాయితీగా వస్తోంది. అన్ని మతాల్లో, అన్ని నాగరికతల్లో అంతర్భాగంగా ఉన్న ఉపవాసం... ఇప్పుడు వైద్యరంగాన్నీ ఆకర్షిస్తుండటం విశేషం. ఒక క్రమం ప్రకారం ఉపవాసం చెయ్యటం వల్ల ఆరోగ్యపరంగా గొప్ప ప్రయోజనాలున్నాయని వైద్య పరిశోధకులు చెపుతున్నారు. ఉపవాసం వల్ల మంచి పెరుగుతుంది.. చెడు తగ్గుతుంది. అవేంటో పరిశీలిద్ధాం. 
 
ఉపవాసం వల్ల కలిగే లాభాల్లో ఆయుర్ధాయం, రక్తంలో గ్లూకోజు నిల్వలపై నియంత్రణ, ఒత్తిడిని తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఆకలిపై నియంత్రణ మెరుగుపడుతుంది. వృద్ధాప్యఛాయలు త్వరగా దరిచేరవు. ఏకాగ్రత, మెదడు పనితీరు, శరీరానికి ఇన్సులిన్ గ్రహించే స్వభావం మెరుగుపడుతుంది. 
 
అలాగే, ఉపవాసం వల్ల పెద్దపెద్ద వ్యాధులకు మూలమైన వాపు స్వభాం తగ్గుతుంది. శరీరంలో పేరుకున్న కొవ్వు కరగడం మొదలవుతుంది. కణాలను దెబ్బతీసే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. తద్వారా కేన్సర్ ముప్పూ తగ్గుతుంది. అధిక రక్తపోటు రాకుండా ఉంటుంది. ట్రైగ్లిజరైడ్లు, చెడ్డ కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిద్ర ఎక్కువైనా కష్టమే- తక్కువైనా నష్టమే.. 8 గంటలపైగా నిద్రొద్దు.. 4 గంటల కంటే తక్కువ నిద్రా వద్దు!