Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిద్ర ఎక్కువైనా కష్టమే- తక్కువైనా నష్టమే.. 8 గంటలపైగా నిద్రొద్దు.. 4 గంటల కంటే తక్కువ నిద్రా వద్దు!

నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచిది. నిద్ర ద్వారానే శరీరానికి కొత్త ఉత్సాహం పొందుతుంది. శరీరానికి, మెదడుకు ఉత్సాహం లభించాలంటే తప్పకుండా నిద్రపోవాల్సిందే. రోజుకు 8 గంటల పాటు నిద్రించని పక్షంలో అనారోగ్య సమస్య

Advertiesment
Find out - Why do we sleep
, బుధవారం, 13 జులై 2016 (15:07 IST)
నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచిది. నిద్ర ద్వారానే శరీరానికి కొత్త ఉత్సాహం పొందుతుంది. శరీరానికి, మెదడుకు ఉత్సాహం లభించాలంటే తప్పకుండా నిద్రపోవాల్సిందే. రోజుకు 8 గంటల పాటు నిద్రించని పక్షంలో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారం, నీరు మనిషికి ఎంత ఆవశ్యమో.. నిద్ర కూడా అంతే అవసరం. 
 
రోజుకు నాలుగు గంటల పాటు నిద్రపోయేవారు.. లేకుంటే అర్థరాత్రంతా మేల్కొని ఆరు గంటలు నిద్రతో సరిపెట్టుకునే వారు.. మరుసటి రోజు యాక్టివ్‌గా పనిచేయలేరని పరిశోధనలో తేలింది. రాత్రుల్లో నిద్రపోకుండా మేల్కొన్నట్లైతే.. ఒబిసిటీ, హృద్రోగ వ్యాధులు, హైబీపీ, డయాబెటిస్, నిద్రలేమి సమస్యల బారిన పడక తప్పదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే నిద్ర ఎక్కువైనా, తక్కువైనా గుండెకు మంచిది కాదని, రోజుకు 4 గంటల పాటు నిద్రపోయే వారికి, 8 గంటలకు పైగా నిద్రించే వారిలో హృద్రోగ సమస్యలు తలెత్తే అవకాశాలున్నట్లు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 
 
ఎన్ని గంటలు నిద్రపోవాలంటే?
అప్పుడే పుట్టిన శిశువు (3 నెలల బిడ్డకు) 14-17 గంటలు 
చిన్నారులు (4 నెలల నుంచి 11 నెలల వరకు) : 12 - 15 గంటలు 
1 నుంచి రెండేళ్ల వయస్సు వారికి : 11- 14 గంటల పాటు నిద్ర అవసరం.
ప్రీ స్కూళ్లర్లకు (3-5 ఏళ్ల చిన్నారులకు) 19-13 గంటల నిద్ర ఆవశ్యకం
స్కూల్‌కు వెళ్లే పిల్లలకు - (6-13 ఏళ్ల పిల్లలకు) 9-11 గంటల నిద్ర అవసరం. 
టీనేజర్లకు (14-17).. 8-10 గంటల నిద్ర అవసరం
18-25 సంవత్సరాల్లోపు గల వారికి.. 7-9 గంటల నిద్ర అవసరం. 
65 ఏళ్లకు పైబడిన వారికి.. 7 నుంచి 8 గంటల పాటు నిద్ర అవసరం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొప్పాయి రసంతో పాలు కలిపి పేస్టును ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే?