Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లవంగంతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

webdunia
గురువారం, 8 జులై 2021 (08:03 IST)
లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ C మరియు K ఉన్నాయి. మాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది మరియు ఎముకలు గట్టి పడటానికి ఉపయోగపడుతుంది. విటమిన్ C మరియు K రోగనిరోధకతను పెంచుతాయి మరియు రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతాయి. 
 
లవంగాలలో యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి తిమ్మిర్లు, అలసట, అతిసారము వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. 
 
లవంగాలలో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు మీ పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే, అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంది. ఇంతే కాదు, లవంగాల వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలున్నాయి.
 
దగ్గు, జలుబు, ఆస్తమానూ తగ్గించడానికి:
లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా, మరియు ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు మరియు దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 
 
ఈ నూనె శ్వాస నాళాన్ని హాయి పరుస్తుంది మరియు యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంది. లవంగం నూనెను ఛాతిపై, ముక్కుపై, ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది.
 
కొన్ని లవంగాలను కొన్ని చుక్కల లవంగం నూనెను వేడి నీటిలో వేసి దాన్ని టీ లా తాగితే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది.  ప్రతీరోజూ ఇలా తాగితే నెమ్మదిగా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి.
 
ఒక లవంగ మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. నొప్పులు వాపులకు, కీళ్ల నొప్పులకు చక్కని నివారణ: లవంగాలలోని యుజెనాల్ అనే పదార్ధానికి శక్తివంతమైన యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.
 
ఇవి లవంగం నూనెలో కూడా పుష్కలంగా ఉన్నాయి. లవంగాలు నోటి పూత మరియు గొంతు వాపులతో కూడా పోరాడుతుంది.  రోజూ లవంగాలు తీసుకున్న వారిలో కేవలం 7 రోజుల్లో సైటోకిన్ స్థాయిలు తగ్గతాయి. ఈ సైటోకైన్లను తగ్గించడం వలన కీళ్ళనొప్పులు మరియు ఆర్థరైటిస్ గణనీయంగా తగ్గుతాయి.
 
రక్త ప్రసరణ మెరుగు పడేందుకు:
 లవంగం నూనె శరీరం యొక్క జీవక్రియను ప్రభావితం చేసి శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది మరియు రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. లవంగాలలోని యాంటీఆక్సిడెంట్ లక్షణములు రక్త శుద్ధి సహాయపడవచ్చు.
 
మధుమేహాన్ని నియంత్రిస్తాయి:
క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పబడిన నైజీరిసిన్ అనే మరొక సమ్మేళనం లవంగాలలో ఉంది. అందువల్ల లవంగాలను ఆహారంలో చేర్చడం ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు.
 
జీర్ణాశయ సమస్యలకు చక్కని పరిష్కారం:
లవంగాలలోని కొన్ని సమ్మేళనాలు  కడుపులోని అల్సర్లను తగ్గిస్తాయి. లవంగాల నుంచి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యూకస్ యొక్క మందం పెంచుతుంది. ఇది కడుపు లైనింగ్ ను రక్షిస్తుంది మరియు సంబంధించిన అల్సర్లను నిరోధిస్తుంది. లవంగాలలో ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది మరియు మలబద్ధకం నిరోధించడానికి ఉపయోగపడుతుంది.
 
తలనొప్పులకు:
లవంగాలలోని నొప్పి తగ్గించే లక్షణాలు అద్భుతాలు చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా కొన్ని లవంగాలను నలిపి శుభ్రమైన రుమాలులో పెట్టి మూటకట్టండి. తలనొప్పి ఉన్నప్పుడు వాసన పీల్చండి. కొంత ఉపశమనం లభిస్తుంది.
 
ఒక టేబుల్ స్పూను కొబ్బరి నూనెకు, రెండు చుక్కల లవంగం నూనెను కలిపి నుదుటిపై మసాజ్ చేసినా మంచి ఫలితం ఉంటుంది.
 
టెస్టోస్టీరాన్ లెవెల్స్ ను పెంచడానికి:
లవంగాలు టెస్టోస్టీరాన్ స్థాయిలను  పెంచుతాయి. లవంగాలు సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది. 
 
వికారం వాంతులకు పరిష్కారంగా:
ఏదైనా తిన్నది సరిగ్గా లేక వాంతులు వచ్చినప్పుడు కడుపు లో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనె ను తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
 
వికారం తగ్గడానికి లవంగంతో మరికొన్ని చిట్కాలు:
 
క్లోవ్ టీ: 
ఒక టీస్పూన్ లవంగం పొడి, లేదా 6 లవంగాలను వేడి నీటిలో వేయండి. త్వరిత ఉపశమనం కోసం రోజులో 2 సార్లు దీన్ని తాగండి.
 
లవంగాలు మరియు తేనే:
ఒక టీస్పూన్ తేనెలో ఒక చిటికెడు లవంగాల పొడిని కలిపి తీసుకోండి. తేడా మీకే తెలుస్తుంది.
 
లవంగం నూనెను వాసన చూడండి:
గర్భిణులలో వచ్చే వికారానికి ఇది బాగా పని చేస్తుంది.
 
చెవి నొప్పికి:
2 టీస్పూన్ల నువ్వుల నూనెను వేడి చేసి 2-3 చుక్కల లవంగం నూనెను వేయండి. ఈ నూనెను ఇప్పుడు నొప్పి ఉన్న చెవిలో వేయండి. నెమ్మదిగా నొప్పి తగ్గుతుంది.
 
మొటిమల సమస్యలకు:
లవంగాలలోని యాంటీబాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ లక్షణాలు చర్మ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. లవంగం నూనె మొటిమలను తగ్గించడానికి మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికీ బాగా పనిచేస్తుంది.
 
లవంగం వలన కలుగు మరికొన్నిఉపయోగాలు –
తేనె, కొంచెం లవంగాల నూనె ను గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు మూడు సార్లు తాగితే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

బాదములతో ప్రీడయాబెటీస్‌తో బాధపడుతున్న యువతలో బ్లడ్‌ గ్లూకోజ్‌ స్థాయి మెరుగు