ఉదయం లేవగానే చాలామంది గోరువెచ్చని నీటిని తాగడం చేస్తుంటారు. ఐతే మరికొందరు గోరువెచ్చని నీరు అనుకుంటారు కానీ విపరీతమైన వేడి నీరు తాగేస్తుంటారు. ఇలా వేడినీరు తాగేవారు అనుకోని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాము. వేడి నీటిని తాగడం వల్ల కలిగే నష్టాలలో కణజాలం దెబ్బతినడం, దాహం సంకేతాలు తగ్గడం వంటివి వుంటాయి.
వేడి నీటిని తాగడం వల్ల రోజువారీ మీరు తాగాల్సినంత ఎక్కువగా మంచినీరు తాగకపోవడం వుండవచ్చు. వ్యాయామం చేసేటప్పుడు సాధారణం కంటే ఎక్కువ హైడ్రేషన్, చెమట అధికంగా పట్టడం వంటివి ఉంటాయి. కొన్నిసార్లు వేడి నీటిని తీసుకోవడం వల్ల పెదవులు, నోటి లైనింగ్‌ను దెబ్బతీయవచ్చు.
వేడి నీరు తాగడం వల్ల నోటిలో బొబ్బలు ఏర్పడితే, అది అన్నవాహిక- జీర్ణవ్యవస్థ యొక్క సున్నితమైన లైనింగ్‌ను కూడా దెబ్బతీస్తుంది. వేడి నీటి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటుంది కనుక ఇది అంతర్గత అవయవాలపై చాలా ప్రభావం చూపుతుంది.
రాత్రి విశ్రాంతి తీసుకునే ముందు అనవసరమైన వేడి నీటిని తీసుకోవడం వల్ల రాత్రిపూట టాయిలెట్ వెళ్లాల్సి రావచ్చు. అందువల్ల నిద్రకు భంగం కలుగవచ్చు.