మతిమరుపు ఉందా? అయితే చాక్లెట్ తినండి...(video)

శుక్రవారం, 11 అక్టోబరు 2019 (14:50 IST)
చాక్లెట్ తినడమనేది చాలామంది పెద్దవాళ్ళల్లో అపోహ ఉంది. చాక్లెట్‌లు తినడానికి తామేమీ చిన్న పిల్లలం కాదని అంటుంటారు. కాని మతిమరుపు అనేది పిల్లలకు మాత్రమే రాదు, పెద్దలకుకూడా వయసు పెరిగే కొద్దీ మతిమరుపు పెరుగుతుంటుంది. దీనికి విరుగుడుగా చాక్లెట్లు తినమంటున్నారు వైద్యులు. 
 
మతిమరుపును దూరం చేసుకోవాలనుకుంటే ప్రతి రోజూ చాక్లెట్లు తప్పనిసరిగా తీసుకోవాలి. సమతులాహారంతోబాటు చాక్లెట్ కూడా మీ ఆహారంలో భాగంగా ఉండాలంటున్నారు వైద్యులు. ముఖ్యంగా డార్క్ చాక్లెట్‌లోవుండే పాలీ ఫెనాల్స్ చర్మానికి. గుండె కణాలకు హాని చేసే రసాయనాలను నివారిస్తాయంటున్నారు వైద్యులు.
 
చాలామందిలో చాక్లెట్‌లు తింటే దంతాలు పాడైపోతాయనే అపోహవుంది. కాని చాక్లెట్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. దీంతో అది దంతాలకు హాని చేసే ఆస్కారమే ఉండదు. మిగిలిన తీపి పదార్థలతో పోల్చితే చాక్లెట్ ఫర్వాలేదని వైద్య నిపుణులంటున్నారు. కాబట్టి ప్రతిరోజు చాక్లెట్ తినడం నష్టం ఏమీ లేదని వైద్యులు సూచిస్తున్నారు. 
 
చాక్లెట్‌లో ఆరోగ్యానికి చాలా మేలు చేసే విటమిన్లు పుష్కలంగా ఉన్నాయని బ్రిటీష్ డైటిక్ అసోసియేషన్ పేర్కొంది. ముఖ్యంగా మిల్క్ చాక్లెట్‌లలో కాల్షియం, విటమిన్ బి2, బి12 పుష్కలంగా వుంటాయని, వీటితోబాటు మెగ్నీషియం, రాగి, ఇనుములాంటివి డార్క్ చాక్లెట్‌లలో పుష్కలంగావుంటాయని, ఇవి శరీరంలోని కొవ్వును తగ్గిస్తాయని వైద్యులు తెలిపారు.
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం తేలు కుట్టినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు..