పచ్చి కొబ్బరి తింటే ప్రయోజనాలు ఎన్నో.....
దేవునికి కొబ్బరి కాయను సమర్పించడం మన సంప్రదాయం. ఆ కొబ్బరిని ప్రసాదంగా కూడా స్వీకరిస్తూ ఉంటాం. పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటే పచ్చడో లేక కొబ్బరన్నమో చేసుకొని తింటాం. ఈ పచ్చి కొబ్బరిలో పోషకాలు అపారం. కొబ్బరి శరీరానికి శక్తిని ఇస్తుంది. దీన్లోని పోషకాలు అవయవ
Publish Date: Wed, 07 Sep 2016 (12:39 IST)
Updated Date: Wed, 07 Sep 2016 (12:41 IST)
దేవునికి కొబ్బరి కాయను సమర్పించడం మన సంప్రదాయం. ఆ కొబ్బరిని ప్రసాదంగా కూడా స్వీకరిస్తూ ఉంటాం. పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటే పచ్చడో లేక కొబ్బరన్నమో చేసుకొని తింటాం. ఈ పచ్చి కొబ్బరిలో పోషకాలు అపారం. కొబ్బరి శరీరానికి శక్తిని ఇస్తుంది. దీన్లోని పోషకాలు అవయవాలు చురగ్గా పనిచేయడానికి దోహదం చేస్తాయి. కొబ్బరిలో పీచు ఉంటుంది. ఇది కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురగ్గా మారుస్తుంది. బరువు తగ్గాలి అనుకొనే వారికి ఇది చాలా మంచిది.
కొబ్బరి శరీరంలో నీటిశాతం కోల్పోకుండా చేస్తుంది. శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్ ను బయటకు పంపేస్తుంది. పచ్చి కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. దెబ్బతిన్న కణాలను వృద్ధి చేయడంలోను కీలకపాత్ర పోషిస్తాయి.
విటమిన్ ఎ,బి,సి, థయామిన్, రైబోప్లెవిన్, నియాసిన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము కొబ్బరిలో పుష్కలంగా లభిస్తాయి. తరుచుగా కొబ్బరిని ఆహారంలో తీసుకునే వారికి మలబద్ధకం, థైరాయిడ్ సమస్యలు దూరంగా ఉంటాయి. కొబ్బరి తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.
chj
Publish Date: Wed, 07 Sep 2016 (12:39 IST)
Updated Date: Wed, 07 Sep 2016 (12:41 IST)