Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

40 ఏళ్లొచ్చినా మొటిమలు వదలడంలేదా? లవంగం వైద్యంతో ఫటాఫట్

మనం ప్రతి రోజు వంటకాలలో రకరకాల సుగంధ ద్రవ్యాలను రుచి కోసం, వాసన కోసం వాడుతుంటాము. ఇవి రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా లవంగం మన శరీరానికి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం.

Advertiesment
40 ఏళ్లొచ్చినా మొటిమలు వదలడంలేదా? లవంగం వైద్యంతో ఫటాఫట్
, శుక్రవారం, 17 ఆగస్టు 2018 (14:17 IST)
మనం ప్రతి రోజు వంటకాలలో రకరకాల సుగంధ ద్రవ్యాలను రుచి కోసం, వాసన కోసం వాడుతుంటాము. ఇవి రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా లవంగం మన శరీరానికి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం.
 
1. మన శారీరక, మానసిక దోషాలను సమన్వయపరచి సమస్థితిలో ఉంచి శుభప్రదంగా, ఆరోగ్యప్రదంగా, ఐశ్వర్యప్రదంగా, మోక్షప్రదంగా ఉపకరించే పరమపవిత్రమైన అత్యంత శక్తివంతమైన స్వామివార్ల తీర్ధాన్ని తయారుచేయటానికి లవంగాలు ప్రముఖపాత్ర వహిస్తాయి.
 
2. 5 మి.లీ. నువ్వుల నూనెలో ఒక లవంగాన్ని నలగ్గొట్టి వేసి వెచ్చజేసి చల్లార్చిన నూనెను రెండుమూడు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవి పోటు తగ్గుతుంది. లవంగాలు దాల్చిన చెక్క, పసుపు, జాపత్రి చూర్ణాలను ఒక్కొక్కటి 10 గ్రా చొప్పున కలిపి ఉంచుకొని రోజు రెండు పూటలా పూటకు 4,5 చిటికెల పొడిని తగినంత తేనెతో కలిపి సేవిస్తుంటే ముక్కు నుంచి నీళ్లు కారటం, తుమ్ములు, ముక్కు, కళ్లు దురదలుపెట్టడం, జలుబు వంటి సమస్యలు తగ్గిపోతాయి.
 
3. లవంగాల చూర్ణానికి సమానంగా నల్లజీలకర్ర చూర్ణాన్ని కలిపి ఉంచుకొని రోజు ఒకసారి తగినంత పొడిలో నీరు కలిపి పేస్టులా చేసి ముఖానికి పలుచగా పట్టించి అరగంట ఆగి గోరువెచ్చని నీటితో కడుక్కుంటుంటే వేధించే మెుటిమల సమస్య తగ్గిపోతుంది.
 
4. లవంగ నూనెలో తడిపిన దూదిని పిప్పి పంటిపై ఉంచితే తక్షణమే నొప్పితగ్గిపోతుంది.
 
5. లవంగాల చూర్ణం, మిరియాల చూర్ణాలను పది గ్రాముల చొప్పున కలిపి ఉంచుకొని ఉదయం, రాత్రి పూట 4,5 చిటికెల పొడిని  పావు టీ స్పూన్ నెయ్యి, అర టీ స్పూన్ తేనె కలిపి సేవిస్తుంటే శ్లేష్మం తెగి పడిపోతుంది. గొంతులో గురగుర తగ్గిపోతుంది. దగ్గు, ఆయాసం నెమ్మదిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మల్లి ఆకులను మెత్తగా పేస్టులా చేసి అక్కడ రాసుకుంటే?