సమ్మర్ టిప్స్.. ఉదయం మజ్జిగ, మధ్యాహ్నం పెరుగు తీసుకోండి..
వేసవిలో ఎండవేడిమి నుంచి తప్పించుకునేందుకు.. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. కర్బూజ, పుచ్చకాయను తీసుకోవాలి. తాటిముంజలు వేడి తాకిడిని బాగా తగ్గిస్తాయి. తాటిముంజ రసాన్ని ముఖానికి రాసుకుంటే.. చెమటకాయల
వేసవిలో ఎండవేడిమి నుంచి తప్పించుకునేందుకు.. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. కర్బూజ, పుచ్చకాయను తీసుకోవాలి. తాటిముంజలు వేడి తాకిడిని బాగా తగ్గిస్తాయి. తాటిముంజ రసాన్ని ముఖానికి రాసుకుంటే.. చెమటకాయలు దరిచేరవు. చర్మం మృదువుగా మారుతుంది. కర్బూజ జ్యూస్‌ను తాగడం ద్వారా ఎండ ప్రభావం నుంచి గట్టెక్కవచ్చు. కీర ముక్కలను సలాడ్ల రూపంలో తీసుకోవచ్చు.
ఉదయం పూట మజ్జిగ తీసుకోవాలి. తద్వారా శరీర వేడిమిని తగ్గించుకోవచ్చు. మధ్యాహ్నం పూట పెరుగు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేసినవారమవుతాం. వీటితో పాటు బత్తాయి, ఆరెంజ్ పండ్లను అలాగే తీసుకోవడం లేదంటే జ్యూస్ రూపంలో తీసుకోవడం ద్వారా శరీరాన్ని వేడి నుంచి కాపాడుకోవచ్చు.
అయితే పగటిపూట ఎండలో తిరగడం మానుకోవాలి. కారమైన ఆహారాన్ని తీసుకోకూడదు. కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. చల్లగా ఉండే ఫ్రిజ్ వాటర్ తాగకూడదు. కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఫండాలి. కోడిమాంసం తీసుకోవడం తగ్గించుకోవాలి. వేసవిలో ఉదయం, సాయంత్రం స్నానం చేయాలి. వారానికి రెండు సార్లు తలస్నానం చేయాలి. తలకు నూనె రాయడం మరవకూడదు. ఎండ వేడిని తగ్గించుకునేందుకు మాయిశ్చరైజర్ క్రీములను వాడాలి. అధికంగా నీటిని సేవించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.