Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉలవలు చేసే మేలు గురించి మీకు తెలుసా?

Advertiesment
Benefits
, గురువారం, 14 ఫిబ్రవరి 2019 (22:15 IST)
ఉల‌వ‌లు గురించి మ‌న దేశంలో తెలియ‌ని వారుండ‌రు. ఉల‌వ‌లు అంటే మ‌న తెలుగు వారికి అమిత‌మైన ఇష్టం. వీటితో కాచుకునే చారు రుచి ఒక్క‌సారి చూస్తే ఇక దాన్ని జీవితంలో విడిచిపెట్ట‌రు. అంత‌టి చ‌క్క‌ని రుచిని ఉల‌వ‌చారు క‌లిగి ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఉల‌వ‌ల‌ను త‌ర‌చూ తింటుంటే దాంతో మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌న శ‌రీరానికి పోష‌కాలు అందుతాయి. ఉల‌వ‌ల వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. ఉల‌వ‌ల్లో ఐర‌న్‌, కాల్షియం, పాస్ఫ‌ర‌స్‌, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరానికి చ‌క్క‌ని పోష‌ణ‌ను అందిస్తాయి. ఫైబ‌ర్ ఉండ‌డం వ‌ల్ల ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. మ‌ధుమేహం అదుపులో ఉంటుంది. గుండె స‌మస్య‌లు రాకుండా ఉంటాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగుప‌డుతుంది.
 
2. ఉల‌వలను క‌షాయం రూపంలో చేసుకుని తీసుకుంటే మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది. క‌ఫం బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది. స్త్రీల‌కు రుతు స‌మ‌యంలో క‌లిగే స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఎక్కిళ్లు త‌గ్గుతాయి. నేత్ర స‌మ‌స్య‌లు పోయి దృష్టి మెరుగు ప‌డుతుంది. 
 
3. ఉల‌వ‌ల‌ను రెగ్యుల‌ర్‌గా తింటుంటే శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌రిగి అధిక బ‌రువు త‌గ్గుతారు. ఒక కప్పు ఉలవలకు నాలుగుకప్పులు నీళ్లు కలిపి కుక్కర్‌లో ఉడికించాలి. ఇలా తయారుచేసుకున్న ఉలవకట్టును ప్రతిరోజూ ఉదయం పూట ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. 
 
4. ఉలవలను, కొత్త బియ్యాన్నీ సమంగా తీసుకొని జావమాదిరిగా తయారుచేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాలపాటు క్రమంతప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతాయి. 
 
5. ఉలవ‌ల్లో ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల ఎదిగే పిల్ల‌ల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వారి శ‌రీర నిర్మాణానికి ప‌నికొస్తాయి. ఆక‌లిని పెంచే గుణాలు ఉల‌వ‌ల్లో ఉంటాయి. మూత్ర పిండాలు, మూత్రాశ‌యంలో ఏర్ప‌డే రాళ్లు క‌రిగిపోతాయి. మ‌ల‌మూత్ర విసర్జ‌న‌లు సాఫీగా అవుతాయి.
 
6. పావు కప్పు ఉలవలను, చిటికెడు పొంగించిన ఇంగువను, పావు టీస్పూన్ అల్లం ముద్దను, పాపు టీ స్పూన్ అతిమధురం వేరు చూర్ణాన్నీ తగినంత నీటిని కలిపి ఉడికించాలి. దీనికి తేనె కలిపి కనీసం నెలరోజులపాటు తీసుకుంటే అల్సర్లు త్వరితగతిన తగ్గుతాయి. 
 
7. ఒక కప్పు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. ఉలవలపై పొట్టు తొలగించటం, మొలకెత్తించటం, ఉడికించటం, వేయించటం వంటివి చేయడం ద్వారా ఉలవల్లోని పోషకతత్వాలు గణనీయంగా పెరుగుతాయి.
 
8. ఉలవలు ఆకలిని పెంచుతాయి. కఫాన్ని పల్చగా మార్చి బయటకు తెస్తాయి. కళ్లు కన్నీరు కారటం, కళ్లల్లో పుసులు కట్టడం వంటి సమస్యలకు ఉలవలతో చేసిన ఆహారం నివారిస్తుంది. మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి, కిడ్నీల పనితీరుని మెరుగుపరుస్తాయి. తరచూ ఎక్కిళ్ల సమస్యతో బాధపడుతున్నవారికి ఉలవలను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిద్రలేమి - నిజాలు... ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి...