Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పొట్లకాయ, సొరకాయ లైంగిక శక్తిని పెంచుతుంది...

Advertiesment
పొట్లకాయ, సొరకాయ లైంగిక శక్తిని పెంచుతుంది...
, శుక్రవారం, 11 అక్టోబరు 2019 (10:21 IST)
పొట్లకాయలు రుచికరమైన ఆహారం, ఎటువంటి వ్యాధుల్లోనయినా ఈ కూర పెట్టవచ్చును. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరానికి చలువ చేస్తుంది. ఆయాసం, ఉబ్బసం ఉన్నవారు ఎక్కువగా పొట్లకాయ కూర తినడం వలన వ్యాధి బాధలు నివారిస్తాయి. 
 
1. పొట్లకాయ కూర లైంగికశక్తిని కూడా పెంపొందిస్తుంది. పిల్లల కడుపులో పాముల్ని పోగొడుతుంది.
 
2. సొరకాయ కూడా.. పురుషులలో వీర్యవృద్ధినీ, లైంగిక శక్తిని పెంచుతుంది. సొరకాయ కూరను చాలామంది పథ్యం కూరగా భావిస్తారు. కానీ తరచుగా తినడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి.
 
3. ఇది శరీరంలో వేడిని, కఫాన్ని తగ్గిస్తుంది. దప్పికను నివారిస్తుంది. వాంతులు, విరేచనాలు, పేగుపూతతో బాధపడేవారు ఈ ఆహారాన్ని తీసుకుంటే మంచిది.
 
4. హృదయ వ్యాధులన్నింటికి సొరకాయ కూర మంచి ఆహారం. దీనితో పాటు శొంఠి పొడిని గానీ, మిరియాల పొడిని గానీ కలిపి తీసుకుంటే పడని వారికి జలుబు చేయదు.
 
5. సొరకాయ గింజలు వీర్యవృద్ధిని కలిగిస్తాయి. సొరకాయ ముదురు గింజలను వేయించుకుని, కొంచెం ఉప్పు, ధనియాలు, జీలకర్ర కలిపి నూరి, కొంచెం అన్నంలో కలుపుకుని తింటుంటే పురుషులకు చాలా మంచిది.
 
6. కొన్ని ప్రాంతాల్లో సొరకాయని అనపకాయలని కూడా అంటారు. పొడవుగా ఉండే సొరకాయలు, కుదిమట్టంగా ఉండే అనపకాయలు రెండూ ఒకే గుణాన్ని కలిగివుంటాయి. ఎక్కువగా సొరకాయ కూరను తింటుంటే ఆరోగ్యం వృద్ధి చెందుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉదయాన్నే కాఫీ తాగేవారు ఇది తెలుసుకోవాల్సిందే...