Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేసవిలో ఈ కాయలు తింటే ఎంత ఆరోగ్యమో తెలుసా? (Video)

వేసవిలో ఈ కాయలు తింటే ఎంత ఆరోగ్యమో తెలుసా? (Video)
, శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (21:47 IST)
సపోటా జ్యూస్‌లో కాపర్, నియాసిన్, ఐరన్, క్యాల్షియం, మరియు ఫాస్పరస్‌లు అధికంగా ఉన్నాయి. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గ్యాస్ట్రిక్, కడుపులో సమస్యలను నివారిస్తుంది. సపోటాలో గల ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. సపోటా జ్యూస్ ఎఫెక్టివ్ జ్యూస్, ఇది నాడీ వ్యవస్థను రిలాక్స్ చేస్తుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ బి అధికంగా ఉంటుంది. ఇది స్ట్రెస్ తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. సపోటా జ్యూస్‌లో ఉండే క్యాల్షియం ఎముకలను బలంగా మార్చుతుంది.
 
2. సపోటా జ్యూస్‌లో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకత పెంచడంలో సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్స్‌తో పోరాడే శక్తిని అందిస్తుంది. హానికరమైన ఫ్రీరాడికల్స్‌ను నివారిస్తుంది. రెగ్యులర్‌గా సపోటా జ్యూస్ తాగడం వల్ల వైరల్, బ్యాక్టీరియల్, ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టమ్‌లో ప్యారాసిస్టిక్ ఎఫెక్ట్స్‌ను తొలగిస్తుంది.
 
3. ఇందులో వుండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది చర్మంలో మ్యూకస్ ఏర్పాటుకు సహాయపడుతుంది. సపోటా జ్యూస్‌లో ఉండే విటమిన్ ఎ లంగ్స్ మరియు సర్వికల్ క్యాన్సర్ నివారించడంలో సహాయపడుతుంది.
 
4. సపోటా జ్యూస్‌లో ఫ్రక్టోజ్ మరియు సుక్రోజ్‌లు అధికంగా ఉన్నాయి. ఇది ఎనర్జీని అందిస్తుంది. శరీరానికి ఇన్‌స్టంట్‌గా శక్తిని అందిస్తుంది. ఇది గర్భిణీ మహిళలకు చాలా ప్రయోజనం కలిగిస్తుంది. పెరిగే పిల్లలకు కూడా సహాయపడుతుంది. 
 
5. సపోటా జ్యూస్ తాగడం వల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది, క్యాపిల్లర్స్‌ను రిపేర్ చేస్తుంది. జుట్టును బలంగా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. జుట్టుకు నేచురల్ కలర్ అందివ్వడంతో తెల్ల జుట్టు నివారించబడుతుంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్, ఎండాకాలం, ఎలాంటివి తింటున్నారు? (Video)