కొత్త జంటకు కలబంద... పాలలో కలుపుకుని తాగితే...
కలబంద.. చాలామందికి కలబంద గురించి తెలియదు. అసలు కలబంద అంటే చాలామంది ఇష్టపడరు. కానీ కొత్తగా వివాహమైన వారికి కలబంద చాలా ఉపయోగపడుతుందట. అంతేకాదు దాంపత్య జీవితానికి ఇది ఎంతో మేలుచేస్తోందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కలబందను కాస్మెటిక్స్‌లో విరివిగా ఉ
కలబంద.. చాలామందికి కలబంద గురించి తెలియదు. అసలు కలబంద అంటే చాలామంది ఇష్టపడరు. కానీ కొత్తగా వివాహమైన వారికి కలబంద చాలా ఉపయోగపడుతుందట. అంతేకాదు దాంపత్య జీవితానికి ఇది ఎంతో మేలుచేస్తోందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కలబందను కాస్మెటిక్స్‌లో విరివిగా ఉపయోగిస్తున్నారు.
కలబంద వేర్లను ముక్కలుముక్కలు చేసి శుభ్రపరిచి ఇడ్లీలు ఉడికించే పాత్రలో ఉంచి.. పాలు పోసి ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికాక.. బాగా ఎండబెట్టి పౌడర్‌లా చేసుకోవాలి. ఈ పొడిని రోజూ ఒక టీ స్పూన్ మేర పాలలో కలుపుకుని తాగితే.. దాంపత్య జీవితం మెరుగ్గా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
అలాగే ఉదయాన్నే పరగడుపున కలబంద గుజ్జును తింటే, ఉదర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. కలబంద గుజ్జు మధుమేహం, కీళ్ళనొప్పులు, జీర్ణకోశ, స్త్రీ సంబంధమైన వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. కలబంధ గుజ్జుతో తయారైన జ్యూస్‌ను తాగడం వలన దీర్ఘకాలం ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. శరీరం కాలిన చోట కలబంద రసం వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు.