Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

మిరపకాయ్ గురించి మీకేం తెలుసు?

ఏ వంటకానికికైనా ఉప్పూ, కారం తప్పనిసరి. అవి సరైన మోతాదులో పడితేనే ఏ వంటకానికైనా రుచి. అయితే మిరప రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా అవసరమే అంటున్నారు నిపుణులు. మిరపలో ఉండే క్యాప్సైసిన్ అనే ఆల్కలాయిడ్ దాని ఘాటుకు కారణం.

Advertiesment
Truths and Facts
, శనివారం, 27 మే 2017 (14:33 IST)
ఏ వంటకానికికైనా ఉప్పూ, కారం తప్పనిసరి. అవి సరైన మోతాదులో పడితేనే ఏ వంటకానికైనా రుచి. అయితే మిరప రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా అవసరమే అంటున్నారు నిపుణులు. మిరపలో ఉండే క్యాప్సైసిన్ అనే ఆల్కలాయిడ్ దాని ఘాటుకు కారణం. 
 
అయితే మిరప క్యాన్సర్ నిరోధకంగా, గుండె మంటను తగ్గించేదిగా, బీపీని నియంత్రించేదిగా, యాంటీ బ్యాక్టీరియాగా ఇలా చాలా రకాలుగా క్యాప్సైసిన్ ఉపయోగపడుతుంది. క్యాన్సర్‌నీ, మధుమహేన్నీ హైపర్ టెన్షన్‌నూ పూర్తిగా తగ్గించలేకున్నా, వాటి నివారణలో ఎంతో సాయం చేస్తుంది. మిరపలో విటమిన్ 'సి' కూడా అధికంగా ఉంటుంది. రక్తనాళాలు, చర్మం, శరీర అవయువాల మధ్య సమన్వయం దీనివల్లే సాధ్యం. 
 
మిరపజాతికి చెందిన వాటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అవి జీవ‌క్రియను వేగవంతం చేసి కొవ్వుల్ని కరిగిస్తాయి. కొంతమేర ఆకలిని తగ్గించి స్థూలకాయ నివారణకు సాయం చేస్తాయని క్లినికల్ న్యూట్రిషన్ మ్యాగజైన్ పరిశోధనలో తేలింది. అలాగని ఎక్కువుగా కాదు. తగిన మోతాదులోనే తీసుకోవాలనేది వారి మాట. ఇప్పటికే కడుపులో మంట సమస్యతో భాదపడేవారు మాత్రం మిరపను తగ్గించి తినడమే మంచిదట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్తిమీర తీసుకుంటే? లైంగిక సమస్యలుండవ్.. కొత్తిమీర టీ తాగితే?