కొత్తిమీర తీసుకుంటే? లైంగిక సమస్యలుండవ్.. కొత్తిమీర టీ తాగితే?
కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా లైంగిక సమస్యలను దూరం చేసుకోవచ్చు. యువతులలో హార్మోనల్ సమతుల్యతను కొత్తిమీర కాపాడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. కొత్తిమీర యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్
కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా లైంగిక సమస్యలను దూరం చేసుకోవచ్చు. యువతులలో హార్మోనల్ సమతుల్యతను కొత్తిమీర కాపాడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. కొత్తిమీర యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్‌గా పనిచేస్తుంది.
జీర్ణకోశంలో గ్యాస్ ఉత్పత్తి కానివ్వదు. కొత్తిమీర జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ ఎ,బి-1, బి-2, సి లభిస్తాయి. ఐరన్ లోపాలతో బాధపడుతున్న వారు ఈ సమస్యను అధికమించటానికి కొత్తిమీరను తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
నోటి దుర్వాసనను నివారించాలంటే.. కొత్తిమీర జ్యూస్‌ను తీసుకోవాలి. కొత్తిమీర టీ తాగితే.. రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. టాక్సిన్లు వెలివేయబడతాయి. ఇంకా ఇందులోని ఫ్లేవనాయిడ్లు లాంటి ఫైటోకెమికల్స్ శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పని చేస్తాయి. ఇవి బరువును తగ్గిస్తాయి.