Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ‌ర్షాకాలంలో తల తడిస్తే... జుట్టుకు ఏమవుతుంది...? తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌లు ఏమిటి...?

వర్షంలో తడిచిన‌ప్పుడు మొదటిగా చర్మం, వెంట్రుకల మీద ప్రభావం ప‌డుతుంది కాబట్టి శ్రద్ధ ఎక్కువ‌గా తీసుకోవాలి. వర్షాకాలంలో తడిసి ఇంటికి వచ్చిన వెంటనే తలస్నానం చేయాలి. వర్షాకాలంలో డే టు డే కేర్ తీసుకుంటే జుట్టును కాపాడుకోవచ్చు. వర్షాకాలంలో సరిగా కేర్ తీసుక

Advertiesment
వ‌ర్షాకాలంలో తల తడిస్తే... జుట్టుకు ఏమవుతుంది...? తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌లు ఏమిటి...?
, మంగళవారం, 2 ఆగస్టు 2016 (16:11 IST)
వర్షంలో తడిచిన‌ప్పుడు మొదటిగా చర్మం, వెంట్రుకల మీద ప్రభావం ప‌డుతుంది కాబట్టి శ్రద్ధ ఎక్కువ‌గా తీసుకోవాలి. వర్షాకాలంలో తడిసి ఇంటికి వచ్చిన వెంటనే తలస్నానం చేయాలి. వర్షాకాలంలో డే టు డే కేర్ తీసుకుంటే జుట్టును కాపాడుకోవచ్చు. వర్షాకాలంలో సరిగా కేర్ తీసుకోకపోతే తడిచిన వెంట్రుకల నుండి చెడు వాసన వచ్చే అవకాశం కూడా వుంది. దాంతో చుండ్రు, వెంట్రుకలు తెగిపోవడం, రాలిపోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తల తడిగా ఉండటం వల్ల తలనొప్పి తరచూ వేధిస్తుంటుంది. కాబట్టి అందుకు తగ్గ సంరక్షణ పద్ధతులు పాటిస్తే వర్షాకాలంలో కూడా కురులు సురక్షితంగా ఉంటాయి. అవేమిటో చూద్దాం.
 
* తల మాడు చాలా చల్లగా, తడిగా మరియు దురదతో ఇరిటేషన్ తెప్పించే విధంగా ఉంటే వేపనూనెను ఉప‌యోగించాలి. నిమ్మనూనెను తలకు రాయడం వల్ల తలను శాంతపరుస్తుంది. నిమ్మలో ఉన్న ఆయుర్వేద గుణాలు కురులు బాగా పెరిగేందుకు సహాయపడుతుంది.  
* కురులు మందంగా, నల్లగా నిగనిగలాడాలంటే నూనెలో కరివేపాకు ఆకులను వేసి నూనెను వేడి చేసి గోరువెచ్చగా తలకు మర్దన చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తుంటే వెంట్రుకలు సున్నితంగా నల్లగా పెరుగుతాయి.
* చుండ్రు ఉన్నవారు వర్షాకాలంలో డైరెక్ట్ గా తలస్నానం చేయకూడదు.తలస్నానానికి ముందు పెరుగు లేదా రీఫైయిన్డ్ ఆయిల్ ను తల మాడుకు బాగా మసాజ్ చేసి,అరగంట తర్వాత స్నానం చేయాలి.
 
* నూనెలు చిక్కగా (ఆముదం)ఉన్నవి ఉపయోగించకుండా పలుచగా ఉండే బాదాం ఆయిల్, కొబ్బరినూనె వంటివి గోరువెచ్చగా చేసి తలకు మర్థన చేయాలి.తలకు నూనెను మసాజ్ చేసి, పది నిమిషాల తర్వాత తలను దువ్వాలి. ఎందుకంటే తలకు వేడి నూనెతో మసాజ్ చేయడం, వెంటనే తలను దువ్వడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగేందుకు సహాయపడుతుంది. దాంతో కేశ కణాలు పునరుత్తేజం చెంది జుట్టు దృఢంగా ఉండేలా చేస్తుంది.
* తడిగా ఉన్నప్పుడు తలను దువ్వకూడదు. తడి కురులు బలహీనప‌డి ఉండటం వల్ల కురులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. 
* హెయిర్ కలరింగ్ లేదా స్ట్రైయిట్ హెయిర్ చేయించుకోవడం ఈ సీజన్లో అంత మంచిది కాదు. హెయిర్ కలరింగ్, స్ట్రైటనింగ్ చేయించుకోవడానికి తర్వాత తలస్నానం చేసుకోవడానికి, తలను తడి ఆర్పడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ ప్రొసెస్ లో వెంట్రుకలు రాలిలోపోయే అవకాశం ఉంది. కాబట్టి తలకు సహజ పద్దతులల్లో కేర్ తీసుకోవడం ఉత్తమం. 
 
* తలకు హెర్బల్ షాంపూ లేదా యాంటీ డాండ్రఫ్ షాంపూను ఉపయోగించడం మంచిది. వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేయడం మంచిది. లేదంటే వాతావరణంలోని కాలుష్యంతో హెయిర్ దెబ్బ తిని రాలిపోవడం, తెగిపోవడం వంటివి జరుగుతాయి. పొడి జుట్టు ఉన్నవారు తలస్నానానికి ముందు తప్పనిసరిగా కండిషనర్ ను అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 
* తలస్నానం తర్వాత తలను తడి ఆర్పుకోవడానికి హెయిర్ డ్రైయర్ ను ఉపయోగించకుండా మంచి పొడి టవల్, మెత్తని టవల్ తో తలను తుడుచుకోవడం వల్ల తలకు మసాజ్ లా ఉపయోగపడుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తులసి అల్లం టీ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో... తయారీ ఎలా?