తులసి అల్లం టీ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో... తయారీ ఎలా?
మారుతున్న వాతావరణం కారణంగా జలుబు రావడం సహజం. కానీ కొంతమందికి జలుబు చేస్తే అంత సామాన్యంగా పోదు. జలుబు వల్ల నానా తంటాలు పడుతుంటారు. గొంతులో విపరీతమైన మంట, ముక్కు నుండి నీరు కారడం ఇలా అనేక సమస్యలు ఇబ్బంద
మారుతున్న వాతావరణం కారణంగా జలుబు రావడం సహజం. కానీ కొంతమందికి జలుబు చేస్తే అంత సామాన్యంగా పోదు. జలుబు వల్ల నానా తంటాలు పడుతుంటారు. గొంతులో విపరీతమైన మంట, ముక్కు నుండి నీరు కారడం ఇలా అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటి వారికి ఒక సులువైన చిట్కా ఏంటంటే... తులసి ఆకుల టీ తాగితే జలుబు ఇట్టే తగ్గిపోతుంది.
ఎందుకంటే సహజ సిద్ధంగా దొరికే తులసి ఆకులో యాంటి వైరల్, యాంటి బాక్టీరియల్ గుణాలు జలుబుకు కారణమైన వైరస్‌లను నిర్మూలించడానికి తోడ్పడుతుంది. రోజుకు రెండు కప్పులు తులసి టీ తాగితే జలుబు మటుమాయమైపోతుంది. అన్ని ఔషధ గుణాలున్నతులసి టీ తయారీ ఎలాగో ఇప్పుడు చూద్దాం....
అల్లం - తగినంత
వాము - 1 స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
తులసి ఆకులు - తగినన్ని
మిరియాలు - 1 స్పూన్
బెల్లం - తీపికి సరిపడా
వీటిని ఒక గిన్నెలో వేసి ఒక 15 నిమిషాలు మరగబెట్టి వడగట్టి గ్లాసులో పోసుకోవాలి. ఈ టీని వేడిగా ఉన్నప్పుడే తాగితే జలుబు నుండి విముక్తి పొందవచ్చు.