బీట్‌రూట్ రసాన్ని తాగితే అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇందులోని నైట్రేట్లు రక్తంలో కలిశాక నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వాయువు రక్తనాళాలను విప్పారేలా చేసి రక్తపోటు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. కాబట్టి రోజూ 250 మి.గ్రా. పచ్చి బీట్‌రూట్ రసాన్ని తాగితే మేలు జరుగుతుంది. బీట్‌రూట్‌లో కేవలం నైట్రేట్లు మాత్రమే కాదు.. విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలూ దండిగా ఉంటాయి. శరీరం క్యాల్షియాన్ని వినియోగించుకోవటంలో తోడ్పడుతుంది. బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది. దీనివలన కలిగే ఆరోగ్యప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బీట్‌రూట్ డయాబెటిక్ సమస్యను ఎదుర్కొంటుంది. అలాగే లివర్‌ను కాపాడుతుంది, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
2. మలబద్దకంతో బాధపడుతున్నవారు బీట్ రూట్‌ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
3. బీట్‌రూట్ రసంలో బోరాన్ ఎక్కువగా ఉన్నందు వలన శృంగార హోర్మోన్స్ ఎక్కువ చేస్తుంది.
4. బీట్‌రూట్‌లో నైట్రేట్‌ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్ ఆక్సైడ్‌లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.
5. బీట్‌రూట్ రసం తాగిన మూడు గంటలకు రక్తపోటులో తగ్గుదల ఉంటుందనీ, దీనివల్ల అనవసర ఆందోళనను దూరం చేసుకోవచ్చనీ పరిశోధనలో తేలింది.
6. సౌందర్యానికి విటమిన్ బి దండిగా ఉండే బీట్‌రూట్... చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడారకుండానూ చూస్తుంది. వీటిల్లోని బీటేన్ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది.
7. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్ తోడ్పడుతుంది. గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది.