అవునా.. జామ ఆకులతో బరువు తగ్గొచ్చా.. అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. అయితే చదవండి. బరువు తగ్గాలనుకునే మహిళలు లేదా పురుషులు రోజూ రెండు జామ ఆకులను నమిలి తింటే సరిపోతుంది. తీసుకున్న ఆహారంలోని కార్బోహైడ్రేట్లు చక్కెరగా మారకుండా చేసి ఆకలిని నియంత్రించే గుణాలు జామ ఆకుల్లో పుష్కలంగా వున్నాయి.
ఐదు కప్పుల నీటిలో గుప్పెడు లేత జామ ఆకు వేసి సగానికి మరిగించి పుచ్చుకుంటే డెంగూజ్వరం త్వరగా తగ్గుతుంది. రక్తంలోని మేలు చేసే కొలెస్ట్రాల్‌ను ప్రభావితం చేయకుండా చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తి జామ ఆకుకు ఉంది. మధుమేహం వున్న వారు రోజూ జామ ఆకులు కాచిన టీని తాగితే మధుమేహం అదుపులో వుంటుంది.
తేనెటీగలు, కందిరీగలు కుట్టిన చోట జామ ఆకు నలిపి రుద్దితే నొప్పి, వాపు తగ్గుతాయి. ఎలర్జీ కారణంగా చర్మం దురద పెడుతుంటే ఆయా భాగాలలో జామ ఆకును రుద్దితే ఉపశమనం లభిస్తుంది. పురుషుల్లో సంతానలేమి సమస్యకు జామ ఆకు ఔషధంగా పనిచేస్తుంది. జామ ఆకు టీ రోజూ తాగితే బ్రాంకైటిస్, శ్వాశ సంబంధిత సమస్యలు, దగ్గు తదితరాలు దారికొస్తాయి.
జామ ఆకులో పుష్కలంగా విటమిన్-సి ఉంటుంది. అందుకే నూరిన జామ ఆకు మిశ్రమాన్ని ముఖానికి రాస్తే మొటిమలు, పొక్కుల వల్ల ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి. జామ ఆకు వేసి మరిగించిన నీటిని చల్లబరచి జుట్టు కుదుళ్ళకు తరచూ పట్టిస్తూ ఉంటే జుట్టు రాలటం ఆగిపోతుంది. జామ ఆకుల పేస్టును ముఖానికి రాసుకుని అరగంట తర్వాత కడిగేస్తే చర్మం మెరిసిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.