Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భోజనం తర్వాత ఈ పొరపాట్లు చేస్తున్నారా? అయితే దరిద్రం మీకు పట్టుకున్నట్టే!

"అన్నం పరబ్రహ్మ స్వరూపం".. సాక్షాత్తూ శ్రీ అన్నపూర్ణా దేవి ఆ పరమశివుడికి అన్నం ప్రసాదించింది. అదీ అన్నానికి ఉన్న గొప్పదనం. అందుకే భోజనం చేయడమంటే నోట్లోకి అన్నం వెళ్ళడమే కాదు.. వడ్డించడం నుంచి తిన్న తర

Advertiesment
Eating
, గురువారం, 29 డిశెంబరు 2016 (15:16 IST)
"అన్నం పరబ్రహ్మ స్వరూపం".. సాక్షాత్తూ శ్రీ అన్నపూర్ణా దేవి ఆ పరమశివుడికి అన్నం ప్రసాదించింది. అదీ అన్నానికి ఉన్న గొప్పదనం. అందుకే భోజనం చేయడమంటే నోట్లోకి అన్నం వెళ్ళడమే కాదు.. వడ్డించడం నుంచి తిన్న తర్వాత చేసే పనులు కూడా భోజన ప్రక్రియలోకే వస్తాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అలాంటప్పుడు ఆహారం తినేప్పుడు మనం చేయకూడని పనుల గురించి మన ధర్మశాస్త్రాలు ఏం చెబుతున్నాయో? ఓ సారి తెలుసుకునేందుకు ప్రయత్నిద్ధాం. 
 
భోజనం ఆరగించిన తర్వాత... చేతులని కంచం లేదా పళ్లెంలో ఎట్టి పరిస్థితుల్లో కడుగరాదు. ఇది పరమ దారిద్ర హేతువు. తిన్నాక కేవలం చేతులని వేరొక చోట మాత్రమే కడగాలి.
 
అన్నం ఆరగించిన కంచాన్ని... ఎప్పుడూ కూడా తిన్నచోటే వదిలేయకూడదు. ఇలా చెయ్యడం వల్ల దారిద్ర లక్ష్మి వచ్చి కూర్చుంటుందని శాస్త్రాలు చెపుతున్నాయి. 
 
అలాగే, భోజనం పూర్తయ్యాక ఎవరైనా చేసే పని కుడి చేతిని మాత్రమే కడగడం.. ఒక్క చేత్తోనే కదా తినేది రెండు చేతులు ఎందుకు అనే లాజిక్‌ని పాటిస్తారు. కానీ, భోజనం ఆరగించిన తర్వాత తప్పకుండా రెండు చేతులూ పరిశుభ్రంగా కడుక్కోవాలి.
 
చివరగా అన్నం ఆరగించి, చేతులు శుభ్రంగా కడిగిన తర్వాత చేతులతో పాటు.. మూతిని పరిశుభ్రమైన గుడ్డతో తుడుచుకోవాలి. అపుడే భోజనం పుష్టిగా ఆరగించినట్టు లెక్క. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ అమ్మాయిలు అబ్బాయిలకు చుక్కలు చూపించాకే శృంగారానికి ఓకే చెప్తారట!