Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్తమా వ్యాధిగ్రస్థులు వంటనూనె విషయంలో జాగ్రత్త.. కాఫీ, ఉల్లిపాయల్ని తీసుకోండి..!

ఆస్తమా కలిగి ఉన్న వారు కాఫీ ఎక్కువగా తాగడం ద్వారా శ్వాసలో ఉండే ఇబ్బందులు బాగా తగ్గిపోతాయి. కాఫీలో ఉండే కెఫీన్ రసాయనికంగా 'థియోఫిలిన్' గుణాలను కలిగి ఉంటుంది. దీని వలన శ్వాస గొట్టాలు విశాలమవుతాయి. అయితే

Advertiesment
4 Ways to Prevent Asthma Attacks at Home
, మంగళవారం, 5 జులై 2016 (11:05 IST)
వర్షాకాలం, శీతాకాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్థులు ఆరోగ్యంపై అధిక శ్రద్ధ తీసుకోవాలి. ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే...? పచ్చి ఉల్లిపాయలను ఆస్తమా వ్యాధిగ్రస్థులు ఎక్కువగా తీసుకోవాలి.

వీటిలో స్కాలియన్లు సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆస్తమాను కలుగచేసే ఇంఫ్లమేషన్‌లను తగ్గిస్తాయి. ఉల్లిపాయ శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి.
 
అలాగే ఆస్తమా కలిగి ఉన్న వారు కాఫీ ఎక్కువగా తాగడం ద్వారా శ్వాసలో ఉండే ఇబ్బందులు బాగా తగ్గిపోతాయి. కాఫీలో ఉండే కెఫీన్ రసాయనికంగా 'థియోఫిలిన్' గుణాలను కలిగి ఉంటుంది. దీని వలన శ్వాస గొట్టాలు విశాలమవుతాయి. అయితే ఉద్రేక పరిస్థితులకు గురైనప్పుడు కాఫీ తాగకుండా ఉండటమే మంచిదని వైద్యులు సలహా ఇస్తుంటారు.
 
నియాసిన్, విటమిన్ బీ6 లోపంతో ఆస్తమా కలుగుతుంది. అందుచేత బీ విటమిన్ గల పచ్చని ఆకుకూరలు, పప్పుల్ని అధికంగా తీసుకోవాలి. ఇంకా ఒత్తిడి అధికం అవటం వలన కూడా ఆస్తమా కలుగవచ్చు. కానీ వంట తయారీకి వాడే నూనెలో విటమిన్-ఈ అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ వాడకాన్ని తగ్గించడం ద్వారా ఆస్తమాను తగ్గించుకోవచ్చు. సన్-ఫ్లవర్ విత్తనాలలో, బాదం, హోల్-గ్రైన్స్, చిరు ధాన్యాలలో విటమిన్-ఈ  తక్కువగా ఉంటుందని గమనించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజూ రెండు చాక్లెట్లు.. ఒక కప్పు ఎరుపు, పసుపు రంగు పండ్లను తింటే?