రోజూ రెండు చాక్లెట్లు.. ఒక కప్పు ఎరుపు, పసుపు రంగు పండ్లను తింటే?
చాక్లెట్‌తో చర్మం మెరుగుపడుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. డార్క్ చాక్లెట్ ద్వారా చర్మ కణాలను యూవీ కిరణాల నుండి నిరోధక శక్తిని అందిస్తుంది. చర్మం తెల్లగా అయ్యేందుకు ఉపకరిస్తుంది. ఇందులోని కోకో పాలి ఫ
చాక్లెట్‌తో చర్మం మెరుగుపడుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. డార్క్ చాక్లెట్ ద్వారా చర్మ కణాలను యూవీ కిరణాల నుండి నిరోధక శక్తిని అందిస్తుంది. చర్మం తెల్లగా అయ్యేందుకు ఉపకరిస్తుంది. ఇందులోని కోకో పాలి ఫినోల్స్, ఫ్లావనాయిడ్స్‌తో పాటు యాంటీ-ఆక్సిడెంట్ చర్మాన్ని మృదువుగా కోమలంగా తయారు చేస్తాయి. కావున రోజుకి నాలుగు చాక్లెట్ల లాగించేస్తే చర్మానికి అందం చేకూరుతుంది.
అలాగే పండ్లు, కూరగాయలు విటమిన్ సిని ఎక్కువగా కలిగివుంటాయి. ఈ విటమిన్ చర్మాన్ని ఆరోగ్యంగా, తెల్లగా మారుస్తుంది. స్కిన్ కేర్ నిపుణులు విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు. ఈ జాబితాలో కివి ఫ్రూట్, స్ట్రాబెర్రీ, చెర్రీస్, టమోటా వంటి సిట్రస్ పండ్లు ఉన్నాయి. ఇంకా ఎరుపు, పసుపు రంగు పండ్లను తీసుకుంటే చర్మ సౌందర్యం బాగా పెంపొందుతుంది.
ఎరుపు, పసుపు రకమైన పండ్లలో ఎక్కువగా ఫైటో రసాయనాలు, కేరోటిన్స్ ఉంటాయి. ఈ రకమైన యాంటీ-ఆక్సిడెంట్స్ చర్మానికి నిరోధక శక్తిని ఇస్తాయి. క్యారేట్స్, మాంగోస్, పంప్కిన్ వంటి ఎరుపు, పసుపుపచ్చ పండ్లు కూరగాయలను ఎక్కువగా తినడం ద్వారా ఆరోగ్యానికి కూడా మేలు చేసినవారవుతారు.