Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

Advertiesment
image

సిహెచ్

, శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (19:19 IST)
తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ (TSCS), వుప్పల వెంకయ్య స్మారక రక్త కేంద్రం సహకారంతో, స్వచ్ఛంద రక్తదాన  శిబిరంల నిర్వాహకుల కృషిని అభినందిస్తూ   ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దాదాపు 110 సంస్థలు పాల్గొన్నాయి, అవన్నీ రక్త మార్పిడి అవసరమైన వారికి రక్తం అందించాలనే సమాజం యొక్క లక్ష్యంకు  గణనీయంగా తోడ్పడ్డాయి. TSCS, హైదరాబాద్ 3,316 స్వచ్ఛంద రక్తదాన శిబిరాలను నిర్వహించడం తో పాటుగా మొత్తం 2,53,397 రక్తమార్పిడులను పూర్తి చేయడం ద్వారా గొప్ప ప్రమాణాన్ని నెలకొల్పింది, ఇది తలసేమియా సంరక్షణ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థ చేయలేని రికార్డు. ఈ మైలురాయి నిరంతర రక్తదాన ప్రయత్నాల ద్వారా ప్రాణాలను కాపాడటానికి సమాజం, దాని స్వచ్ఛంద సేవకుల అంకితభావాన్ని హైలైట్ చేస్తుంది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూ ఢిల్లీలోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ డైరెక్టర్ & హెడ్, ఇండియన్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ & ఇమ్యునోహెమటాలజీ (ISBTI) సెక్రటరీ జనరల్  డాక్టర్ సంగీతా పాఠక్ స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకుల కృషిని ప్రశంసించారు. తలసేమియా మరియు ఇతర రక్త రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు రక్తమార్పిడి కోసం స్థిరమైన రక్త సరఫరాను నిర్ధారించడంలో ఈ శిబిరాలు పోషించే కీలక పాత్రను డాక్టర్ పాఠక్ నొక్కిచెప్పారు. గౌరవ అతిథి, ఫెడరేషన్ ఆఫ్ బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక సెక్రటరీ జనరల్ మరియు పశ్చిమ బెంగాల్ వాలంటరీ బ్లడ్ డోనర్స్ ఫోరమ్ జనరల్ సెక్రటరీ శ్రీ అపూర్బా ఘోష్ మాట్లాడుతూ  శిబిరాల ప్రాముఖ్యతను ఎత్తిచూపారు.పెద్ద ఎత్తున రక్తదాన డ్రైవ్‌లను నిర్వహించడంలో TSCS యొక్క ముఖ్యమైన ప్రయత్నాలను ప్రశంసించారు.

రక్తదాన శిబిరం నిర్వాహకుల నిర్విరామ కృషికి TSCS అధ్యక్షుడు డాక్టర్ చంద్రకాంత్ అగర్వాల్ తన కృతజ్ఞతలు తెలిపారు. "ఒక వ్యక్తి దానం చేసిన రక్తం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుంది." అని చెప్పారు. ఈ కార్యక్రమంలో TSCS  సెక్రటరీ, డాక్టర్ సుమన్ జైన్, వైస్ ప్రెసిడెంట్, శ్రీమతి రత్నావళి, జాయింట్ సెక్రటరీ, శ్రీ అలీమ్ బేగ్, కోశాధికారి, శ్రీ మనోజ్ రూపానీ, మరియు  బోర్డు సభ్యుడు, శ్రీ  అమీన్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?