Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీలోఫర్‌ హాస్పిటల్‌లో పది పడకల ఐసీయు కోసం నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌తో సింక్రోనీ భాగస్వామ్యం

icu
, శనివారం, 14 మే 2022 (16:23 IST)
ప్రీమియర్‌ వినియోగదారుల ఆర్థిక సేవల కంపెనీ సింక్రోనీ, నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌తో భాగస్వామ్యం చేసుకుని పది పడకల పిడియాట్రిక్‌ ఐసీయు వార్డ్‌ను నీలోఫర్‌ హాస్పిటల్‌లో ఏర్పాటుచేసింది. దీనిద్వారా అత్యంత క్లిష్టమైన వైద్య సేవలు అవసరమైన రోగులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులు మరింతగా అందుబాటులోకి వచ్చాయి.

 
హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్పత్రి నీలోఫర్‌. ఆసియాలో ఈ తరహా హాస్పిటల్స్‌లో అతిపెద్దది. ఇక్కడ మహిళలు, చిన్నారులకు పూర్తి ఉచితంగా ఆరోగ్య సేవలనందిస్తారు. తెలంగాణా రాష్ట్రంలో చిన్నారుల కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన హాస్పిటల్‌ ఇది. దీని సేవల కోసం విపరీతంగా డిమాండ్‌ ఉండటంతో పాటుగా అదనపు ఐసీయు పడకల ఆవశ్యకత కూడా అధికంగా ఉంది. ఈ పది పడకల పీడియాట్రిక్‌ ఐసీయు ఏర్పాట్లను సింక్రోనీ  చేసింది. దీనికి నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌ తగిన మద్దతును అందించింది. ప్రస్తుత ప్రభుత్వ హాస్పిటల్‌లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి  చేయడానికి ఇది మద్దతునందిస్తోంది.

 
సింక్రోనీ, నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌లు 10 ఐసీయు ప్లవర్‌ పడకలను పరుపులతో సహా (5 మడతలు), 10 సక్షన్‌ అపారటస్‌, 5 పారా కార్డియాక్‌ మానిటర్లు, 10 సిరెంజ్‌ పంపులు, 1 ఈసీజీ మెషీన్‌, 12 ఛానెల్‌, 1 డీఫ్రిబ్రిలేటర్‌, 3 బైపాప్‌ మెషీన్లు, 2 ఫోటోథెరఫీ మెషీన్లు, 4 వెంటిలేటర్లు, 12 పార్టిషన్‌ కర్టెన్లు, 4 ఎయిర్‌ కండీషనర్లను కోవిడ్-19 రోగులకు అత్యంత విలువైన క్రిటికల్‌ కేర్‌ ఇవ్వడానికి అందించింది.

 
ఈ సందర్భంగా డాక్టర్‌ మురళీకృష్ణ, సూపరిండెంట్‌, నీలోఫర్‌ హాస్పిటల్‌ మాట్లాడుతూ, ‘‘నీలోఫర్‌ హాస్పిటల్‌ తరపున  మేము మనస్ఫూర్తిగా సింక్రోనీ, నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌కుధన్యవాదములు తెలుపుతున్నాము. అవసరమైన వైద్య పరికరాలను వారు అందజేశారు. ఈ పరికరాలు మాకు రోగులకు మరింతగా సహాయపడేందుకు, మరీ ముఖ్యంగా కోవిడ్-19, ఇతర వ్యాధుల బారిన పడిన వారికి మెరుగైన చికిత్సలనందించేందుకు తోడ్పడతాయి’’ అని అన్నారు.

 
ఈ కార్యక్రమం గురించి కామేశ్వరి గంగాధరభట్ల, వైస్‌ ప్రెసిడెంట్‌- హ్యూమన్‌ రిసోర్సెస్- ఆసియా డైవర్శిటీ అండ్‌ రిక్రూట్‌మెంట్‌ సీఓఈ లీడర్‌, సింక్రోనీ మాట్లాడుతూ, ‘‘కోవిడ్‌-19 దాని ప్రభావాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్యోగులు సురక్షితంగా ఉండేందుకు అవసరమైన కార్యక్రమాలను సంస్థ నిర్వహిస్తూనే మా భాగస్వాములు, వినియోగదారులు, వాటాదారులు, మా చుట్టు పక్కల సమాజాలకు అవసరమైన సహాయాన్నీ అందిస్తున్నాము. ఒకరికొకరు సహాయపడటానికి మేము కట్టుబడి ఉండటంతో పాటుగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న కమ్యూనిటీలకు తగిన మద్దతునూ అందిస్తున్నాము. నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌ మరియు నీలోఫర్‌ హాస్పిటల్‌తో ఈ అతి ముఖ్యమైన కార్యక్రమం కోసం భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు.

 
నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ శ్రీ మయూర్‌ పట్నాల మాట్లాడుతూ, ‘‘మార్చి 2020 నుంచి కోవిడ్-19 మహమ్మారి యొక్క తీవ్రతకు ఇండియా సతమతమవుతూనే ఉంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ప్రతి ఒక్కకి మద్దతు కోవిడ్-10 బాధితులకు కావాల్సి వచ్చింది. తెలంగాణాలోని నీలోఫర్‌ హాస్పిటల్‌లో 10 పడకల ఐసీయు ఏర్పాటుచేసేందుకు మద్దతునందించిన సింక్రోనీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము’’ అని అన్నారు.

 
గతంలో సింక్రోనీ సంస్థ నిర్మాణ్‌తో భాగస్వామ్యం చేసుకుని 4355 హోమ్‌ ఐసోలేషన్‌ కిట్లును కోవిడ్-19తో ప్రభావితమైన బీద కుటుంబాలకు అందించింది. అలాగే 10000 రక్షిత ఉపకరణాలను ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు హైదరాబాద్‌లోని ప్రైమరీ హెల్త్‌ కేర్‌ సెంటర్లలో అందించింది. సెకండ్‌ వేవ్‌ సమయంలో తెలంగాణా వ్యాప్తంగా మూడు నెలల పాటు కోవిడ్‌-19 హెల్ప్‌లైన్‌‌ను నిర్మాణ్‌ భాగస్వామ్యంతో నిర్వహించింది.

 
గతంలో సింక్రోనీ సంస్థ టెలిహెల్త్‌ ఉపకరణాలను నీలోఫర్‌ హాస్పిటల్స్‌కు అందించింది. వాటిలో జీఈ హెల్త్‌కేర్‌ అల్ట్రాసౌండ్  ఉపకరణాలు, వెర్సానా యాక్టివ్‌ పోర్టబుల్‌ వంటివి ఉన్నాయి. వీటితో పాటుగా ఎంఎన్‌జె ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ అండ్‌  రీజనల్‌ క్యాన్సర్‌ సెంటర్‌(పీడియాట్రిక్‌ వింగ్‌)కు లాజిక్‌ వీ2; మిలటరీ హాస్పిటల్‌లో వీ స్కాన్‌ను అందించి అవసరంలో ఉన్న చిన్నారులు, క్యాన్సర్‌ ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న ఇతర రోగులకు సహాయపడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగళూరులోని రామయ్య నారాయణ హార్ట్‌ సెంటర్‌లో 14 ఏళ్ల బాలుడికి నూతన జీవితం