Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 71 పట్టణాలకు జియో ఫైబర్ హైస్పీడ్ బ్రాడ్‌బాండ్ సేవలు

Jio Fiber
, గురువారం, 12 మే 2022 (12:50 IST)
దేశంలో అత్యంత వేగవంతమైన హై స్పీడ్ బ్రాడ్ బాండ్‌గా పేరొందిన జియో ఫైబర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తన ఉనికిని మరింత పటిష్ఠం చేసుకుంది. వేగవంతమైన విస్తరణలో భాగంగా జియో ఫైబర్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో 71 ముఖ్యమైన నగరాలు, పట్టణాలను చేరుకుంది.

 
ఆంధ్రప్రదేశ్‌లో జియో ఫైబర్ 43 నగరాలు, పట్టణాల్లో పటిష్ఠ ఉనికితో తన నాయకత్వ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. విజయవాడ, విశాఖపట్నం వంటి ముఖ్యమైన నగరాలు మాత్రమే గాకుండా, అనకాపల్లి, అనంతపురం, భీమవరం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, కడప, ధర్మవరం, ఏలూరు, గన్నవరం, గుడివాడ, గుంతకల్, గుంటూరు, హిందూపురం, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మదనపల్లె, నందిగామ, నంద్యాల, నరసారావుపేట, నెల్లూరు, నిడదవోలు, నూజివీడు, ఒంగోలు, పెద్దాపురం, పొన్నూరు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాళహస్తి, శ్రీకాకుళం, తాడేపల్లె, తాడేపల్లెగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, వినుకొండ, విజయనగరం, ఉయ్యూరులలో కూడా జియో ఫైబర్ లభ్యమవుతుంది.

 
తెలంగాణలో కూడా జియోఫైబర్ 28 నగరాలు, పట్టణాలకు తన సేవలను విస్తరించింది. హైదరాబాద్ మాత్రమే గాకుండా ఆదిలాబాద్, బోధన్, భువనగిరి, హనుమకొండ, జగిత్యాల, జనగాం, కోదాడ, కొత్తగూడెం, కామా రెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మంచిర్యాల్, మేడ్చల్, మిర్యాలగూడ, మహేశ్వరం, నల్గొండ, నిజామాబాద్, రామగుండం, సంగారెడ్డి, షాద్‌నగర్, శంకర్ పల్లి, సూర్యాపేట, తాండూర్, వనపర్తి, వరంగల్, జహీరాబాద్ లలో కూడా లభ్యమవుతుంది. త్వరలో మరో 7 పట్టణాలకు విస్తరించనుంది.

 
జియోఫైబర్ వేగంగా విస్తరించడం విద్యారంగంలో ఉన్న వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎంతగానో తోడ్పడింది. విశ్వసించదగిన, తిరుగులేని హైస్పీడ్ బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్‌తో వారికి ఎంతో ప్రయోజనం కలిగించింది. ఎంతోమంది వృత్తినిపుణులు మరీ ముఖ్యంగా ఐటీ, ఇతర సేవా రంగాలకు చెందినవారు రాష్ట్రంలోని తమ స్వస్థలాల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఎంతో సజావుగా తమ పనులు చేసుకోగలుగుతున్నారు. ఈ పట్టణాల్లోని ఎన్నో చిన్న సంస్థలు, విద్యాసంస్థలు తమ వ్యాపారాలు, వృత్తుల డిమాండ్లకు అనుగుణంగా డిజిటల్ విధానం లోకి మారిపోగలిగాయి.

 
నూతన పోస్ట్- పెయిడ్ ప్లాన్ యూజర్లకు జియో ఫైబర్ ఇప్పుడు ఎలాంటి ప్రవేశరుసుము లేకుండానే లభిస్తుంది. యూజర్లు గనుక జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్‌ను ఎంచుకుంటే, రూ.10,000 విలువ కలిగిన ఇంటర్నెట్ బాక్స్ (గేట్ వే రూటర్), సెట్ టాప్ బాక్స్, ఇన్‌స్టలేషన్లను ఉచితంగానే పొందగలుగుతారు. మరో సంచలనాత్మక ఆఫర్ జియో ఫైబర్ ఎంటర్టెయిన్మెంట్ బొనాంజా. ఇది అదనంగా చెల్లించే రూ. 100తోనే అపరిమిత వినోదాన్ని అందిస్తుంది. వినియోగదారులు నెలకు రూ.399ల ప్రారంభ ధరతో అపరిమిత హైస్పీడ్ ఇంటర్నెట్‌కు యాక్సెస్ పొందవచ్చు. నెలకు రూ.100 లేదా రూ.200 అదనంగా చెల్లించడం ద్వారా వారు 14 ప్రముఖ ఓటీటీ యాప్స్ కలెక్షన్ నుంచి తమకు నచ్చిన కంటెంట్‌ను చూడవచ్చు. 

 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో జియో ఫైబర్ ఇళ్లు మొదలుకొని చిన్న, పెద్ద సంస్థలు, వివిధ రంగాలకు చెందిన వృత్తినిపుణులతో సహా లక్షలాది మంది వినియోగదారుల అవసరాలను తీరుస్తోంది. అపరిమిత వినోదం, వార్తలు, ఆరోగ్యం, చదువు లాంటివాటికి వేదికగా నిలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

SSC Phase X Recruitment 2022:1920 పోస్టులను భర్తీ