Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

Advertiesment
image

ఐవీఆర్

, గురువారం, 10 జులై 2025 (23:43 IST)
హైదరాబాద్: భారతదేశంలోని వైద్య నిపుణులు శ్వాస సంబంధిత సింకిటియల్ వైరస్‌(ఆర్ఎస్వి)పై అత్యవసర దృష్టిని సూచిస్తున్నారు. ఇది బాగా వ్యాపించే, కానీ తక్కువగా చర్చకు వచ్చే వైరస్‌గా పరిగణించబడుతోంది. ఇది ఐదేళ్ళలోపు పిల్లల్లో, శిశువుల్లో దిగువ శ్వాసనాళ సంబంధిత ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణంగా మారుతోంది.
 
ఆర్ఎస్వి సాధారణంగా మామూలు జలుబుగా భావించబడుతుంది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 36 లక్షల ఆసుపత్రుల్లో చేర్పులు, దాదాపు లక్ష మంది ఐదేళ్ళ లోపు పిల్లల మరణాలకు కారణమవుతుంది. సంవత్సరానికి సుమారు 2.5 కోట్ల శిశువుల జననంతో, భారత్ ఈ భారంలో పెద్ద వాటాను కలిగి ఉంది. మాన్సూన్, శీతాకాల ప్రారంభ సమయంలో నెయోనేటల్ ఐసీయూలలో రోగుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఆరోగ్యంగా పుట్టిన శిశువులు కూడా అన్ని వర్గాలకు చెందినవారైనా ఆర్ఎస్వి వల్ల ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ అవసరం అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే తల్లిదండ్రులు, ఆరోగ్య సంరక్షణ నిపుణుల మధ్య ఆర్ఎస్వి నివారణకు సంబంధించిన అవగాహన పెంచడం ఎంతో కీలకం.
 
ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్(ఐఎపి) ప్రస్తుత జాతీయ అధ్యక్షులు డాక్టర్ వసంత్ ఎం. ఖలాత్కర్ మాట్లాడుతూ, “ ఆర్ఎస్వి అనేది శిశువుల ఆరోగ్యానికి పెద్ద ముప్పు. చేతులు కడుక్కోవడం వంటి పరిశుభ్రత చర్యలు అవసరమే కానీ, అవి ఒక్కటే సరిపోవు. ముఖ్యంగా ఒక ఏడాది లోపు శిశువులకి. ఇటీవల డబ్ల్యుహెచ్ఓ సిఫారసు చేసిన దీర్ఘకాలిక మోనోక్లోనల్ యాంటీబాడీలు, భారత్ వాటికి అందుబాటును కల్పించిన నేపథ్యంలో, చిన్నారులను రక్షించడానికి ఎంతో అవసరమైన సాధనాలు మనకు లభిస్తున్నాయి. ఇప్పటికే పలివిజుమాబ్ అనే మందు హై-రిస్క్ శిశువులకు అందుతోంది. ఇది ఆర్ఎస్వి సీజన్ సమయంలో నెల నెలా ఇచ్చే డోసుల ద్వారా రక్షణ కల్పిస్తుంది. ఇప్పుడు నిర్సేవిమాబ్ అనే ఒక్క డోసుతో మొత్తం సీజన్‌కు రక్షణ కల్పించే యాంటీబాడీ రాకతో,ఆర్ఎస్వి నివారణలో ఒక కొత్త అడుగు వేయబడ్డది. ఇది పుట్టిన తర్వాత వెంటనే లేదా పీడియాట్రిక్ ఫాలోఅప్ సమయంలో ఇచ్చినట్లయితే, ఆర్ఎస్వి కారణంగా ఆసుపత్రిలో చేరే శిశువుల సంఖ్యను తగ్గించవచ్చు. బ్రాంకియోలైటిస్, న్యుమోనియా లాంటి తీవ్రమైన సమస్యల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. ముందుజాగ్రత్త, సమయానికి అవగాహన, తల్లిదండ్రుల భాగస్వామ్యం ఇవన్నీ భారత్‌లో ఆర్ఎస్వి ప్రభావాన్ని తగ్గించడంలో కీలకం.”
 
సానోఫీ ఇంటర్నేషనల్ రీజియన్ మెడికల్ హెడ్ డాక్టర్ సీజర్ మస్కరెనాస్ మాట్లాడుతూ, “మేము చాలా కాలంగా శాస్త్రీయంగా ఆధారిత పరిష్కారాల అభివృద్ధిపై పనిచేస్తూ, డబ్ల్యుహెచ్ఓ వంటి సంస్థల మార్గదర్శకాలతో అనుసంధానంగా పనిచేస్తున్నాం. భారత్‌లో ఆర్ఎస్వి బాధను తగ్గించేందుకు ఆధునిక నివారణ సంరక్షణను తీసుకురావడం అత్యవసరం. అవగాహనను బలపరచడం, రక్షణ చర్యలకు ప్రాప్యత మెరుగుపరచడం, సమయానికి టీకాలు అందించడం, ఇవన్నీ రాబోయే తరాల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలకమైన అడుగులు.”
 
డాక్టర్ రెడ్డీస్ మెడికల్ అఫైర్స్ హెడ్ డాక్టర్ భావేష్ కోటక్ మాట్లాడుతూ, “భారత్ ఆర్ఎస్వి  ప్రపంచ భారంలో పెద్ద భాగాన్ని కలిగి ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ముందస్తుగా నివారణా చర్యలు అందుబాటులో ఉన్నప్పటికీ, భారత్‌లో త్వరిత నిర్ధారణ, రక్షణలో ఇంకా సవాళ్లు ఉన్నాయ్. ఆర్ఎస్వి తీవ్రతపై అవగాహన పెరగడం, ఆధునిక టీకా పరిష్కారాలు అందుబాటులోకి రావడం, ఇవి సమానత్వంతో కూడిన మరియు సమర్థవంతమైన జాతీయ ప్రతిస్పందనకు దారితీస్తాయి.”
 
2025 ఏప్రిల్‌లో, సానోఫీ మరియు డాక్టర్ రెడ్డీస్ కలిసి శిశువులను ఆర్ఎస్వి సంబంధిత సమస్యల నుంచి రక్షించేందుకు రూపొందించిన ఒక కొత్త డోసుతో ఇవ్వగల టీకాను భారత్‌కు తీసుకురావడానికి తమ భాగస్వామ్యాన్ని విస్తరించారు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ విషయంలో మరిన్ని వివరాల కోసం తమ పీడియాట్రిషన్ లేదా నెయోనటాలజిస్ట్‌ను సంప్రదించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు