Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్జికల్‌ రోబో-ఎస్‌ఎస్‌ఐ మంత్ర , భారతదేశంలో మొట్టమొదటి గుండె శస్త్రచికిత్స

Advertiesment
robotic surgery
, శనివారం, 15 ఏప్రియల్ 2023 (19:20 IST)
వైద్యశాస్త్రంలో సాంకేతికత పరంగా ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నాయి. అలాంటి ఆవిష్కరణలలో రోబో సర్జరీ ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా సుప్రసిద్ధమైన రోబోటిక్‌ కార్డియాక్‌ సర్జన్‌ కావడంతో పాటుగా ఈ రంగంలో అశేష ప్రయోగాలను చేసిన డాక్టర్‌ సుధీర్‌ ప్రేమ్‌ శ్రీవాస్తవ మానస పుత్రిక ఎస్‌ఎస్‌ఐ మంత్ర. సామాన్యునికి  సైతం అత్యంత అందుబాటు ధరలో నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ రోబోను ఆయన తీర్చిదిద్దారు.
 
వాణిజ్యపరంగా ఆగస్టు 2022లో అందుబాటులోకి తీసుకువచ్చిన నాటి నుంచి విజయవంతంగా 130 శస్త్రచికిత్సలను చేసిన ఎస్‌ఎస్‌ఐ మంత్ర సర్జికల్‌ రోబో స్టూడియో మరోమారు నేడు హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ హాస్పిటల్‌లో చరిత్ర సృష్టించింది. ఈ రోబోటిక్‌ సర్జరీ వ్యవస్థను విజయవంతంగా రోబో అసిస్టెడ్‌ లిమా (లెఫ్ట్‌ ఇంటర్నల్‌ మామ్మరీ ఆర్టెరీ) కోసం 35 సంవత్సరాల వ్యక్తిపై ఉపయోగించారు.
 
ఎస్‌ఎస్‌ఐ మంత్ర చేసిన ఈ చారిత్రక ఫీట్‌పై ఎస్‌ఎస్‌ ఇన్నోవేషన్స్‌ ఫౌండర్‌, ఛైర్మన్‌, సీఈఓ డాక్టర్‌ సుధీర్‌ శ్రీ వాస్తవ మాట్లాడుతూ, ‘‘ హైదరాబాద్‌లో ఎస్‌ఎస్‌ఐ మంత్ర వినియోగించి గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా చేయడం, అత్యంత ఖచ్చితత్త్వంతో కార్డియాక్‌ శస్త్రచికిత్సలను చేయడంలో సిస్టమ్‌ యొక్క విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. సరికొత్త సవాల్‌తో కూడిన శస్త్రచికిత్సలను చేపట్టడానికి సైతం ఇది ప్రోత్సహిస్తుంది’’ అని అన్నారు. రోబొటిక్‌ కార్డియో సర్జరీలలో తన అపార అనుభవంతో ఈ శస్త్రచికిత్సకు డాక్టర్‌ సుధీర్‌ శ్రీ వాస్తవ నేతృత్వం వహిస్తే, కాంటినెంటల్‌ హాస్పిటల్‌లో సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియోథొరాకిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ప్రదీప్‌ కె రాచకొండ, హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ల బృందం తమ మద్దతును అందించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖర్జూరం పాలు ఎంత బలమో తెలుసా?