Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భోజనాలకు ముందు బాదములు తింటే ప్రి-డయాబెటీస్‌ రోగులలో బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు మెరుగు

image
మంగళవారం, 21 మార్చి 2023 (21:30 IST)
బాదములపై చేసిన రెండు నూతన అధ్యయనాలు , ఒక అధ్యయనాన్ని మూడు రోజుల పాటు చేయగా, మరో అధ్యయనాన్ని  మూడు నెలల పాటు నిర్వహించగా, అవి బాదముల వల్ల కలిగే ప్రయోజనాలను వెల్లడించాయి. ఈ అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం, ప్రీ డయాబెటీస్‌ మరియు అధిక బరువు/ఊబకాయంతో బాధపడుతున్న ఆసియన్‌ భారతీయులలో మూడు నెలల పాటు నిత్యం బాదములు తీసుకోవడం వల్ల వారిలో ప్రీ డయాబెటీస్‌ పూర్తిగా తగ్గడం లేదా గ్లూకోజ్‌ స్ధాయిలు నియంత్రించబడటం జరిగింది. అధ్యయనంలో పాల్గొన్న దాదాపు ఒక వంతు (23.3%)మందిలో బ్లడ్‌ షుగర్‌ సాధారణ స్ధాయికి చేరుకుంది.
 
ఈ రెండు అధ్యయనాలలోనూ 60 మంది ప్రజలు 20 గ్రాముల బాదములు (0.7 ఔన్స్‌)ను... అంటే చిన్న గుప్పెడు పరిమాణంలో ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్నర్‌కు అరగంట ముందు ఈ అధ్యయన కాలంలో తిన్నారు. ఈ బాదముల అధ్యయన ఫలితాలను వెల్లడించేందుకు పూర్తి ఉత్సాహం కనబరిచిన పరిశోధకులు, మొట్టమొదటిసారిగా గణాత్మకంగా గణనీయంగా ప్రీ డయాబెటీస్‌ స్ధాయిలను తగ్గడం తాము చూశామని, డైట్‌ ద్వారా ప్రీ డయాబెటీస్‌ను తగ్గించడాన్ని ‘హోలీ గ్రెయిల్‌ ఆఫ్‌ మెడిసన్‌’గా పిలుస్తున్నామన్నారు.
 
అత్యుత్తమంగా గ్లూకోజ్‌ నియంత్రణ, డైటరీ వ్యూహాలైనటువంటి బాదములను ఆహారంలో జోడించడం వల్ల మధుమేహం వృద్ధి చెందకుండా అడ్డుకోవడమూ సాధ్యమైంది. దాదాపు 70% మంది వ్యక్తులు తమ జీవితకాలంలో మధుమేహులుగా మారే అవకాశాలున్నాయి. నిర్వహించిన ఈ రెండు అధ్యయనాలూ ర్యాండమైజ్డ్‌ కంట్రోల్డ్‌ ట్రయల్స్‌. వీటికి ఆల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా నిధులను సమకూర్చింది. అధ్యయనకారులు వెల్లడించే దాని ప్రకారం, ప్రీ-లోడింగ్‌ అంటే  ముఖ్యమైన మీల్స్‌కు ముందు బాదములు తీసుకోవడం వల్ల గ్లూకోజ్‌ స్థాయి తగ్గడంతో పాటుగా ఇన్సులిన్‌ ఒడిదుడుకులు సైతం భోజనం తరువాత తగ్గుతుంది మరియు మొత్తంమ్మీద నియంత్రతి డైట్‌తో పోల్చినప్పుడు హైపర్‌గ్లెసెమియా తగ్గుతుంది. ఈ అధ్యయనంలో కనుగొన్న అంశాలు విభిన్నమైన వ్యక్తులపై చేసిన అధ్యయనాలను కాంప్లిమెంట్‌ చేస్తున్నాయి. సమతుల ఆహారంలో భాగంగా బాదములు తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన స్థాయిలో బ్లడ్‌ షుగర్‌ సాధ్యమవుతుందని ఆ అధ్యయనాలు వెల్లడించాయి.
 
‘‘మా అధ్యయన ఫలితాలు సూచించే దాని ప్రకారం, డైటరీ వ్యూహాలలో భాగంగా బ్లడ్‌ గ్లూకోజ్‌ స్థాయిలను తగ్గించడంలో అత్యంత కీలక తోడ్పాటుదారునిగా బాదములు ఉపయోగపడుతున్నాయి. ఈ ఫలితాలు చూపే దాని ప్రకారం, కొద్ది మొత్తంలో బాదములను ప్రతి భోజనానికీ ముందు తీసుకోవడం వల్ల వేగంగా మరియు అద్భుతంగా గ్లైసెమిక్‌ నియంత్రణ అనేది భారతదేశంలోని ఆసియన్‌ ఇండియన్స్‌లో సాధ్యమవుతుంది. మరీ ముఖ్యంగా కేవలం మూడు రోజులలో ప్రీ-డయాబెటీస్‌ నియంత్రణలోకి వస్తుంది. నోటి ద్వారా తీసుకునే గ్లూకోజ్‌ లోడ్‌కు కనీసం 30 నిమిషాల ముందు 20 గ్రాముల బాదములు తీసుకుంటే, గణనీయంగా బ్లడ్‌ షుగర్‌ తగ్గడంతో పాటుగా హార్మోన్లు కూడా నియంత్రించబడతాయి.
 
ఫైబర్‌, మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్స్‌, జింక్‌, మెగ్నీషియం వంటి పోషకాలు కలిగిన బాదములు కారణంగా గ్లైసెమిక్‌ నియంత్రణ జరగడంతో పాటుగా ఆకలి కూడా తగ్గుతుంది’’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ అనూప్‌ మిశ్రా, ప్రొఫెసర్‌ అండ్‌ ఛైర్మన్‌, ఫోర్టిస్‌-సీ-డాక్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ డయాబెటీస్‌, మెటబాలిక్‌ డిసీజెస్‌ మరియు ఎండోక్రినాలజీ (న్యూఢిల్లీ) అన్నారు.  ‘‘మా వినియోగదారులకు నమ్మకమైన డైటరీ వ్యూహాలను ప్రీ డయాబెటీస్‌ వృద్ధి వేళ అందించాలనుకున్నాము మరియు సాధారణ గ్లూకోజ్‌ నియంత్రణకు ప్రజలు తిరిగి రావడానికి సైతం తోడ్పడ్డాము’’ అని అన్నారు.
 
ఆయనతో పాటుగా ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు కూడా ఆయనతో ఏకీభవించారు. ‘‘డయాబెటీస్‌ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా, ప్రధాన భోజనానికి 30 నిమిషాల ముందు బాదంపప్పులు తీసుకోవడం వంటి ఆహార వ్యూహాలు భోజనం తరువాత రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను తగ్గించడానికి మంచి ఎంపికగా నిలుస్తాయి’’ అని డాక్టర్‌ సీమా గులాటీ, హెడ్‌-న్యూట్రిషన్‌ రీసెర్చ్‌ గ్రూప్‌, నేషనల్‌ డయాబెటీస్‌, ఒబేసిటీ అండ్‌ కొలెస్ట్రాల్‌ ఫౌండేషన్‌ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చింత ఆకుల రసం తీసుకుంటే?