Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

Advertiesment
Ferty9

ఐవీఆర్

, సోమవారం, 20 జనవరి 2025 (23:21 IST)
దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ సంతానోత్పత్తి సంరక్షణ నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందిన ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్, కర్నూలులో తమ అధునాతన సౌకర్యాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. భారతదేశంలో దాదాపు 10-15% జంటలను సంతానలేమి ప్రభావితం చేస్తుందని అంచనా. అంటే, సుమారుగా ఇది దేశవ్యాప్తంగా 30 మిలియన్ల జంటలపై ప్రభావం చూపుతున్నట్లుగా చూడాల్సి ఉంది. అందుబాటులో ఉండే ప్రత్యేక సంతానోత్పత్తి సంరక్షణ అవసరం ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ఉంది. కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రం ఈ ప్రాంతంలో సంతానోత్పత్తి చికిత్సను పునర్నిర్వచించటానికి సిద్ధంగా ఉంది, వినూత్న సాంకేతికతలతో ప్రపంచ స్థాయి సంరక్షణను అందించనుంది.
 
అధిక-నాణ్యత కలిగిన చికిత్సలను అందించాలనే తన మిషన్‌ను ఫెర్టీ9 కొనసాగిస్తోంది, దాదాపు 70% ఐవిఎఫ్ విజయశాతం కలిగిన ఫెర్టీ9 ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అంతటా 20,000 మంది విజయవంతంగా గర్భం దాల్చటంలో సహాయ పడింది. కర్నూలు కేంద్రం ఐయుఐ, ఐవిఎఫ్, ఐసిఎస్ఐ, బ్లాస్టోసిస్ట్ కల్చర్, PICSI, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్, జెనెటిక్ టెస్టింగ్ ప్రోగ్రామ్‌లతో సహా సమగ్ర సంతానోత్పత్తి చికిత్సల ను అందిస్తుంది.
 
ఒకే చోట నాలుగు అద్భుతమైన సాంకేతికతలను అందిస్తోన్న భారతదేశంలోని ఏకైక సంతానోత్పత్తి బ్రాండ్, ఫెర్టీ9. ఇప్పుడు కర్నూలులోని కుటుంబాలకు ఇది చెరువులోకి వచ్చింది. ఈ పురోగతులు సంతానోత్పత్తి చికిత్సలలో అసమానమైన ఖచ్చితత్వం, భద్రత మరియు విజయాన్ని నిర్ధారిస్తాయి:
 
ఐఎస్ఓ 6 క్లీన్‌రూమ్ ల్యాబ్‌లు: యూరోపియన్-ప్రమాణాలతో కూడిన క్లాస్ 1000 క్లీన్‌రూమ్ ల్యాబ్‌లు అత్యుత్తమ స్టెరిలిటీని నిర్ధారిస్తాయి, కాలుష్య ప్రమాదాలను తగ్గించడం, సంరక్షణ యొక్క అత్యున్నత ప్రమాణాలను నిర్వహించడం చేస్తుంది. 
 
ఆర్ఐ విట్నెస్ (RFID సిస్టమ్): ప్రతి బీజకణమునకు రోగి గుర్తింపును సురక్షితంగా లింక్ చేయడం ద్వారా ఐవిఎఫ్ చక్రాల సమయంలో అసమతుల్యతలను నివారిస్తుంది.
 
కె -సిస్టమ్ ఇంక్యుబేటర్లు: పిండాల కోసం గర్భాశయం లాంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది, విజయ రేట్లను గణనీయంగా పెంచుతుంది.
 
జిలిట్రిక్స్ (XILTRIX) అలారం సిస్టమ్: సరైన కార్యాచరణను నిర్ధారించడానికి క్లిష్టమైన ల్యాబ్ పరిస్థితులను నిర్వహిస్తుంది.
 
ఈ సాటిలేని సాంకేతికత కలయిక సంతానోత్పత్తి సంరక్షణలో కొత్త ప్రమాణాలను నిర్దేశించటంలో ఫెర్టీ9 యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుంది, మాతృత్వంకు వారి ప్రయాణంలో జంటలను శక్తివంతం చేస్తుంది.
 
ఫెర్టీ9 కర్నూల్‌లోని ఐవిఎఫ్ కన్సల్టెంట్ డాక్టర్ సుశ్రుత మాట్లాడుతూ, “కర్నూల్‌లోని ప్రతి కుటుంబానికి అధునాతన సంతానోత్పత్తి సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, లోతైన సానుభూతితో కూడిన విధానాన్ని ఉపయోగించడం ద్వారా, మేము జంటలను ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లేలా చేయడం, తల్లిదండ్రులుగా మారాలనే వారి కలను సాకారం చేసుకునేందుకు ఉత్తమ అవకాశాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ కేంద్రం తమ కుటుంబాలను నిర్మించుకోవాలనుకునే వారికి ఆశలు మరియు కొత్త ప్రారంభాలకు నిదర్శనం.." అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం