Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

Advertiesment
cooldrinks

ఠాగూర్

, ఆదివారం, 10 ఆగస్టు 2025 (10:40 IST)
అనేక ప్రతిరోజు ఇష్టానుసారంగా శీతలపానీయాలు తాగుతుంటారు. అలాగే డైట్ సోడా కూడా తాగుతుంటారు. ఇలాంటి వారికి పక్షవాతం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మాస పత్రికలో ఈ అధ్యయన నివేదిక ప్రచురితమైంది. అధ్యయనకారులు 45 ఏళ్లు దాటిన 2,800 మందిని పదేళ్లపాటు పరిశీలించారు. వారి పరిశోధనలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 
 
'కూల్‌డ్రింక్ తాగిన ఒక గంటలో మన శరీరంలో 10 టీ స్పూన్ల షుగర్ డంప్ అవుతుంది. 20 నిమిషాల్లో రక్తంలో షుగర్ శాతం పెరుగుతుంది. భారీగా పెరిగిన ఇన్సులిన్‌కు అనుగుణంగా మన శరీరం స్పందిస్తుంది. సుమారు 40 నిమిషాలకు కెఫిన్ మన రక్తంలోకి పూర్తిగా ఇంకుతుంది. ఇది మన రక్తపోటును (బీపీ) పెంచుతుంది. లివర్‌ను ట్రిగ్గర్ చేయడంతో రక్తంలోకి మరింత షుగర్ విడుదల అవుతుంది. 
 
బ్రెయిన్‌లోని సంతోష కేంద్రాలను డొపమైన్ ఉత్తేజపరుస్తుంది. 60 నిమిషాల తర్వాత కాల్షియం, మరికొన్ని కీలక లవణాలతో కలసి ఫాస్ఫారిక్ యాసిడ్ మన పేగుల్లో అట్టకడుతుంది. మూత్రవిసర్జన అవసరాన్ని కెఫిన్ ప్రేరే పించడంతో అవి మూత్రం ద్వారా బయటకు వెళ్లడం ప్రారంభమవుతుంది' అని ఆ అధ్యయనం వివరించింది.
 
డైట్ సోడాలు తాగేవాళ్లకు వాటిలోని కృత్రిమ స్వీట్నర్లతో పక్షవాతం, డిమెన్షియా వచ్చే ప్రమాదం మూడింతలు పెరుగుతుంది అని తెలిపింది. శీతల పానీయాలు/డైట్ సోడాలతో నేరుగా ప్రమాదం జరుగుతుందని చెప్పలేం కానీ, ప్రమాద ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయని మాత్రం చెప్పవచ్చని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మాస పత్రికలో ప్రచురితమైన వ్యాసం పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?