ప్రస్తుత కాలంలో చక్కెర వ్యాధి బారిన పడటం సర్వసాధారణమై పోయింది. దీనికి ప్రధాన కారణం మనిషి జీవనశైలిలో వచ్చిన మార్పే. దీంతో దేశంలో సగం మందికి పైగా ఈ వ్యాధి బారినపడినట్టు పలు సర్వేలు చెపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఓ సర్వేలో ఓ ఆసక్తికర అంశం వెలుగు చూసింది.
సంసార జీవితంలో పూర్తి సంతృప్తి పొందుతున్న భర్తల కంటే తృప్తిలేని పతులకే మధుమేహం వచ్చే ముప్పు తక్కువని, ఒకవేళ ఉన్నా.. అది అదుపులో ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. ఇంట్లో అన్ని విషయాల్లోనూ ఆధిపత్యం చలాయించే మహిళలు భర్త ఆరోగ్యం విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారట. ఒకవేళ అప్పటికే భర్తకు డయాబెటిస్ వచ్చినట్టైతే దాన్ని అదుపులో ఉంచుకునేలా సతాయిస్తారట.
ఈ సర్వేను 1288 మంది జంటలపై చేపట్టారు. అయితే భార్యల విషయంలో మాత్రం అది రివర్స్ అవుతుందట. వివాహ బంధంలో సంతోషంగా ఉన్న మహిళకు డయాబెటిస్ ఆలస్యంగా వస్తుందట. రిలేషన్‌షిప్ విషయంలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ సెన్సిటివ్‌గా ఉండడమే దీనికి కారణమట.