Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుండె జబ్బులు... జీవనశైలి మార్చుకుంటేనే...

జీవనశైలిని పూర్తిగా మార్చుకోవడం ద్వారా ఒత్తిడి, గుండె జబ్బులు రాకుండా చేసుకోవచ్చు. పని మీద ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఖాళీ సమయంలో ఇష్టమైన వ్యాపకం పెట్టుకోవాలి. చికాకు పెడుతున్న అంశం మనసులోకి రానంతగా

గుండె జబ్బులు... జీవనశైలి మార్చుకుంటేనే...
, శుక్రవారం, 27 మే 2016 (22:27 IST)
జీవనశైలిని పూర్తిగా మార్చుకోవడం ద్వారా ఒత్తిడి, గుండె జబ్బులు రాకుండా చేసుకోవచ్చు. పని మీద ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఖాళీ సమయంలో ఇష్టమైన వ్యాపకం పెట్టుకోవాలి. చికాకు పెడుతున్న అంశం మనసులోకి రానంతగా వ్యాపకాలను కల్పించుకోవడం మంచిది. ఒకసారి చిన్నప్పటి స్నేహితులను గుర్తు చేసుకుని కలవడానికి ప్రయత్నించాలి. దూరాన ఉన్నవారితో ఫోన్ చేసి కబుర్లు చెప్పాలి. కంటినిండా నిద్రపోవాలి. నిద్రపట్టకపోతే మాత్రం స్లీపింగ్ టాబ్లెట్లను ఆశ్రయించవద్దు. నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తాగండి. 
 
రోజూ అరగంట నడవండి. యోగా చేయండి. జంక్ ఫుడ్‌ను పూర్తిగా మానేసి తాజాపండ్లు, కూరగాయలను తీసుకోవాలి. ఆలోచనలను సానుకూల దృక్పథంలో సాగనివ్వాలి. మరోవైపు మారిన జీవన విధానం, ఒత్తిడి, వ్యాయామ లేమి మూలంగా గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. గుండె జబ్బులు వచ్చిన తర్వాత బాధపడటం కంటే చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రాకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం పెద్దగా శ్రమపడాల్సిన పనిలేదు. 
 
* ప్రతిరోజూ మెనూలో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. 
* ఉప్పు వీలైనంత వరకు తగ్గించాలి. 
* వాకింగ్ చేస్తే గుండెకు మంచిది. 
*  కాబట్టి రోజూ 45 నిమిషాలు నడవండి 
*  వీలైనంత వరకు లిఫ్ట్ వాడకాన్ని తగ్గించి నడిచి మెట్లెక్కడం అలవాటు చేసుకోండి. 
* ఆహారంలో కొవ్వు పదార్థాలు లేకుండా చూసుకోండి. 
*  కొలెస్ట్రాల్ పరీక్షలు, బ్లడ్ షుగర్, బీపీని చెక్ చేయించుకోండి
* బరువును నియంత్రణలో ఉంచుకోండి 
* ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోండి. 
ఈ చిట్కాలు పాటిస్తే గుండెను పదిలం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముఖం, ముక్కుపై నల్లటి మచ్చలా... ఈ చిట్కాలు పాటించండి...