Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

CARE Hospitals Group Honours their Nurses

ఐవీఆర్

, శుక్రవారం, 10 మే 2024 (19:12 IST)
రోగులకు నర్సుల సేవలు ప్రశంసనీయమని, అమ్మ తర్వాత అంతటి సేవలు అందిస్తున్న ఘనత సమాజంలో నర్సింగ్ సిబ్బందిదేనని కేర్ హాస్పిటల్స్ గ్రూప్ యొక్క సీఈఓ జస్దీప్ సింగ్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన నర్సుల వృత్తికి గౌరవాన్ని తీసుకువచ్చిన ఫ్లోరైన్స్‌ నైటింగేల్‌ నివాళులర్పించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ నర్సులు అంకితభావంతో సేవ చేసిన వాల్దారిని ప్రశంసించారు.
 
కేర్ హాస్పిటల్స్ గ్రూప్, విపి-నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్, డాక్టర్ విన్సీ అశోక్ త్రిభువన్ నేతృత్వంలో ముషీరాబాద్‌లోని కేర్ హాస్పిటల్స్ యొక్క హెచ్‌సిఓఓ అబ్దుల్ నఫెహ్ మద్దతుతో, గురునానక్ మిషన్ ట్రస్ట్ సహకారంతో, వెరిటాస్ సైనిక్ స్కూల్ క్యాంపస్‌లో మొక్కలు నాటే కార్యక్రమంలో కేర్ హాస్పిటల్స్ నర్సులు పాల్గొన్నారు. వారం రోజుల వ్యవధిలో, 100 కంటే ఎక్కువ మొక్కలు నాటబడ్డాయి. ఇది ఆసుపత్రి నర్సింగ్ నిపుణులు అందించిన సంరక్షణకు ప్రతీకగా, సీఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా పర్యావరణ సుస్థిరతను కాపాడుతున్నట్లు డాక్టర్ విన్సీ అశోక్ త్రిభువన్ తెలిపారు.
 
మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు, కేర్ హాస్పిటల్స్ నర్సింగ్ లీడర్‌షిప్ బృందం సికింద్రాబాద్‌లోని ది లిటిల్ సిస్టర్స్ ఆఫ్ ది పూర్ వృద్ధాశ్రమాన్ని సందర్శించింది, అక్కడ వారు వృద్ధులతో ఆనందం, దయ యొక్క అద్వితీయ క్షణాలను పంచుకున్నారు. ఈ రోజు హృదయపూర్వకంగా కేక్ కటింగ్ వేడుక, అవసరమైన వస్తువులను అందజేయటం ద్వారా, నివాసితులకు సౌకర్యం- ఉల్లాసాన్ని కలిగించింది.
 
గ్రూప్ సీఈఓ, కేర్ హాస్పిటల్స్ గ్రూప్, జస్దీప్ సింగ్, మాట్లాడుతూ హెల్త్‌కేర్‌లో పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు, "ఆరోగ్య సంరక్షణ ప్రదాతలుగా, మేము మా కమ్యూనిటీలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు