Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోడిగుడ్డు పెంకుల్ని కూడా తినొచ్చని మీకు తెలుసా? అదెలాగో తెలుసుకోండి!

కోడిగుడ్ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారంటూ ఎవ్వరూ ఉండరు. చికెన్‌, మ‌ట‌న్ తిన‌ని అధిక శాతం మంది కోడిగుడ్ల‌నే ఎంచుకుంటారు. కోడిగుడ్ల‌ు తినడం వల్ల అధిక పోషకాలు మన శరీరానికి అందుతాయి. పోష‌కాల‌తో పాటు త‌గిన శ‌క్తి కూ

కోడిగుడ్డు పెంకుల్ని కూడా తినొచ్చని మీకు తెలుసా? అదెలాగో తెలుసుకోండి!
, శనివారం, 9 జులై 2016 (15:50 IST)
కోడిగుడ్ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారంటూ ఎవ్వరూ ఉండరు. చికెన్‌, మ‌ట‌న్ తిన‌ని అధిక శాతం మంది కోడిగుడ్ల‌నే ఎంచుకుంటారు. కోడిగుడ్ల‌ు తినడం వల్ల అధిక పోషకాలు మన శరీరానికి అందుతాయి. పోష‌కాల‌తో పాటు త‌గిన శ‌క్తి కూడా అందుతుంది. అయితే కేవ‌లం కోడిగుడ్ల‌లో ఉండే తెల్ల‌ని, ప‌చ్చ‌ని సొనే కాదు, కోడిగుడ్డు పెంకుల‌ను కూడా తిన‌వ‌చ్చ‌ని మీకు తెలుసా! పడేసే పెంకులను ఎలా తింటాం.. అనే క‌దా మీ సందేహం. అదేలాగో ఇప్పుడు చూద్దాం...
 
కోడిగుడ్డు పెంకుల‌ను ముందుగా శుభ్రంగా క‌డిగి నీటిలో మ‌రిగించాలి. నీటిలో మ‌రిగించాక ఆ నీటి నుంచి పెంకుల‌ను తీసి ఆర‌బెట్టాలి. ఆ తరువాత మిక్సీలో వేసి పౌడ‌ర్‌ చేసుకోవాలి. అలా తయారు చేసిన పౌడ‌ర్‌ను ప్రతిరోజూ అర టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకోవాలి. దీని వ‌ల్ల రోజులో మ‌న‌కు కావ‌ల్సిన కాల్షియంలో దాదాపు 90 శాతం వ‌ర‌కు అందుతుంది. ఇది మ‌న ఎముక‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. దంతాలు, ఎముక‌లు, న‌రాల‌కు ఈ కాల్షియం ఎంత‌గానో  మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.
 
ఇంట్లో మొక్క‌ల‌ను ఎక్కువ‌గా పెంచేవారు ఆ పెంకుల్ని ప‌డేయ‌కుండా మొక్క‌ల‌కు ఎరువుగా వేస్తే అవి ఏపుగా పెరుగుతాయి. ఈ పౌడ‌ర్‌ను ఇంట్లో పెంచుకునే కుక్క‌ల‌కు కూడా తినిపించ‌వ‌చ్చ‌ట‌. దీని వ‌ల్ల వాటికి కూడా కాల్షియం బాగా అందుతుంది. కోడిగుడ్డు పెంకుల పౌడ‌ర్‌లో ఉండే ఔష‌ధ కార‌కాలు బీపీని, ర‌క్తంలోని చెడు కొలెస్ట‌రాల్‌ను నశింపజేస్తుంది. కాఫీని మ‌ర‌గ‌బెట్టే స‌మ‌యంలో కొద్దిగా ఎగ్‌షెల్ పౌడ‌ర్‌ను క‌లిపితే కాఫీ ఎక్కువ చేదుగా ఉండద‌ట‌. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రయాణాల్లో నిద్రెందుకు... ఫేస్ బుక్ ఉందిగా..? మొబైళ్ల వాడకంలో మహిళలే టాప్!!