Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రయాణాల్లో నిద్రెందుకు... ఫేస్ బుక్ ఉందిగా..? మొబైళ్ల వాడకంలో మహిళలే టాప్!!

సోషల్ మీడియా ఫేస్ బుక్ మాయ అంతా ఇంతా కాదు. స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని ఎక్కడ పడితే అక్కడ ఫేస్ బుక్‌ చూసుకుంటూ కాలం గడిపేసే వారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువవుతుంది.

Advertiesment
Youngesters use Facebook to aid journey
, శనివారం, 9 జులై 2016 (15:45 IST)
సోషల్ మీడియా ఫేస్ బుక్ మాయ అంతా ఇంతా కాదు. స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని ఎక్కడ పడితే అక్కడ ఫేస్ బుక్‌ చూసుకుంటూ కాలం గడిపేసే వారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువవుతుంది. ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ఫేస్ బుక్ చూసుకుంటూ.. షేర్స్, లైక్స్ ఇస్తూ.. ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేస్తుండే వారి సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో.. సమాచార మాధ్యమాల ప్రభావంతో కుటుంబ విలువలు కూడా బాగా తగ్గిపోతున్నాయి. ఇంట్లో ఏంటి ఆఫీసుల్లోనూ ఫేస్ బుక్‌లతో గడిపేస్తున్న ప్రస్తుత యువత ప్రయాణాల్లోనూ అదే తంతును కొనసాగిస్తున్నట్లు తాజా సర్వేలో తేలింది.
 
ఈ విషయం హోటల్ డాట్ కామ్ వాళ్లు చేసిన మొబైల్ ట్రాకర్ సర్వేలో బయటపడింది. భారతదేశంలో దాదాపు 50 శాతం మంది ఇతర సోషల్ నెట్ వర్క్‌ల కంటే ఫేస్ బుక్‌నే ఎక్కవగా వాడుతున్నారని తెలిపింది. ప్రయాణాల్లో నిద్రించడం కంటే స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టుకుని హ్యాపీగా ఫేస్ బుక్‌ల్లో ఫ్రెండ్స్‌తో చాట్ చేయడానికే ఇష్టపడుతున్నారట. ప‌దిమంది ప్ర‌యాణికుల్లో సుమారు 9 మంది ఏదో ఒక యాప్‌ను వాడుతున్నారట. 
 
మ‌గ‌వాళ్ల కంటే మ‌హిళ‌ల మొబైల్ వాడ‌కం అధికం అని సర్వేలో వెల్లడైంది. ఇంకా 95 శాతం మంది టీవీలు, సినిమాల కంటే ఫేస్ బుక్‌లోనే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్నారట‌. విహార యాత్ర‌ల్లో కూడా సైట్ సీయింగ్ కంటే అక్క‌డ ఫోటోలు తీసుకోవ‌డానికే ఇష్ట‌ప‌డుతున్నార‌ని సర్వేలో తేలింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మందుకొట్టి తలకెక్కిన కిక్ తగ్గాలంటే.. గ్రేప్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్‌ను తింటే చాలట!