Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెన్న: వాస్తవాలు మరియు ప్రయోజనాలు

వెన్న: వాస్తవాలు మరియు ప్రయోజనాలు
, ఆదివారం, 26 డిశెంబరు 2021 (21:25 IST)
ఎన్నో దశాబ్దాలుగా భారతీయ కుటుంబాల డైనింగ్‌ టేబుల్స్‌పై వెన్న ఆధిపత్యం చూపుతూనే ఉంది. విభిన్న వంటకాలలో వాడటమే కాదు, భోజనం చేసేటప్పుడు కూడా వెన్న రుచులను ఆస్వాదించడం చాలామందికి అనుభవమే. ఈ కారణంగానే భారతీయ బటర్‌ (వెన్న) మార్కెట్‌లో ఆవు వెన్న, గేదె వెన్న, సాల్టెడ్‌ మరియు అన్‌శాల్టెడ్‌ కౌ, బఫెలో బటర్‌ రూపంలో మనకు అది లభిస్తుంది. భారతదేశంలో విభిన్నరకాల బ్రాండ్లు నూతన అనుభవాలనూ వినియోగదారులకు అందిస్తున్నారు. వినియోగదారులిప్పుడు పూర్తి ఫార్మ్‌ ఫ్రెష్‌ బటర్‌ కోరుకుంటున్నారు. అయితే ఈ వెన్నలో గేదె వెన్న ఎందుకు ఎక్కువ ప్రేమిస్తున్నారు?

 
డైరీ ఫార్మింగ్‌ పరిశ్రమలో తాజా ప్రవేశం ఈ బఫెలో బటర్‌. దీనిలో అత్యధిక మొత్తంలో కొవ్వు ఉండటంతో పాటుగా తక్కువగా నీరు ఉంటుంది. మహమ్మారి అనంతర కాలంలో దీనిని ఆరోగ్యవంతమైనదిగా భావిస్తున్నారు. ఓ టేబుల్‌ స్పూన్‌ బఫెలో బటర్‌లో 110 కేలరీల శక్తి ఉంటుంది. దీనిలో 12 గ్రాముల ఫ్యాట్‌, కొద్ది మొత్తంలో ఫైబర్‌, ప్రొటీన్‌ ఉంటాయి. అయితే దీనిలో అతి తక్కువ కొలెస్ట్రాల్‌, ఆవు వెన్నతో పోలిస్తే అధిక కేలరీలు ఉంటాయి. దీనిలో ఉన్న కొవ్వు శాతం కారణంగా ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటుంది.

 
గేదె వెన్న ఎలా వినియోగించవచ్చంటే...
స్వీట్ల తయారీలో విరివిగా దీనిని వినియోగిస్తున్నారు. సహజసిద్ధమైన రుచి స్వీట్లకు రావడంలో ఇది తోడ్పడుతుంది. గజర్‌ కా హల్వా, మైసూర్‌ పాక్‌, లడ్డూలు వంటి తయారీలో దేశవ్యాప్తంగా గేదె నెయ్యిని విరివిగా వాడుతున్నారు.

webdunia
బేకింగ్‌లోనూ బఫెలో బటర్‌ అధికంగా వాడుతున్నారు. కుకీ లేదంటే కేక్‌మిక్స్‌లో దీనిని వాడితే దీని రుచి కూడా అద్భుతంగా పెరుగుతుంది. ఇండియన్‌ డిషెస్‌ మాత్రమే కాదు ఇటాలియన్‌ పాస్తా, సీఫుడ్‌ తయారీలో కూడా బఫెలో బటర్‌ను విరివిగానే వాడుతున్నారు. నిజానికి మెరుగైన రుచులు పొందాలను ఎలాంటి డిష్‌కు అయినా బఫెలో బటర్‌ జోడించవచ్చు.

 
బహువిధాలుగా వినియోగించుకునే అవకాశం, దీనిలో ఉన్న పోషకాల కారణంగా భారతీయ కుటుంబాలలో  ప్రాధాన్యతా  డెయిరీ ఉత్పత్తులలో ఒకటిగా బఫెలో బటర్‌ వాడుతున్నారు.
- కిశోర్‌ ఇందుకూరి, ఫౌండర్‌, సిద్స్‌ ఫార్మ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అది మీరు వద్దని అనుకున్నా వదలలేరు, ఏంటది?